Begin typing your search above and press return to search.

జెంటిల్ మెన్ గేమ్ లో మరీ ఇంత తొండాట?

By:  Tupaki Desk   |   10 Oct 2022 4:54 AM GMT
జెంటిల్ మెన్ గేమ్ లో మరీ ఇంత తొండాట?
X
జెంటిల్ మెన్ గేమ్ అంటూ గొప్పలు చెప్పే క్రికెట్ ఆటలోనూ మర్యాద అంతకంతకూ తగ్గుతోంది. ఒకరినొకరు 'టచ్' చేసుకోకుండా పోరాటే గొప్ప ఆటగా దీనికి పేరుంది. అలాంటి ఆటలో గెలుపు చేసే చేష్టలు కొన్ని వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి చేసిన ఒక ఆసీస్ బ్యాట్స్ మెన్ చేసిన తొండాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ముక్కున వేలేసుకునేలా చేసింది. ఎంత అవుట్ కాకూడదంటే మాత్రం మరీ ఇంత తొండాట అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ జరిగిందేమంటే..

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వచ్చారు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు. అక్టోబరు 9న అంటే ఆదివారం తొలి మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. మొత్తంగా 20 ఓవర్లకు 6 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోర్ ను చేశారు. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగారు ఆసీస్ బ్యాట్స్ మెన్లు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది.

వుడ్ వేసిన 17వ ఓవర్ మూడో బంతికి ఆసీస్ బ్యాట్ మెన్ వేడ్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయటం.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. క్యాచ్ పట్టేందుకు వుడ్ స్ట్రయికర్ ఎండ్ కు పరిగెడుతుండగా.. అప్పటికే క్రీజ్ వైపుకు వెళుతున్న వేడ్.. బౌలర్ వుడ్ ను ఉద్దేశపూర్వకంగా గట్టిగా తోసేసి క్యాచ్ పట్టకుండా చేశాడు. ఇలాంటి తొండి ఆటకు స్టేడియంలో ఉన్న వారే కాదు.. టీవీల్లో లైవ్ చూస్తున్న వారంతా తిట్టి పోసిన పరిస్థితి.

నిబంధనల ప్రకారం చూస్తే.. ఇలాంటి పరిస్థితుల్లో వుడ్ అంపైర్లకు ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. దీంతో.. అతగాడు ఔట్ నుంచి తప్పించుకున్నా.. ఇలాంటి తొండి ఆటకు నిదర్శనం అన్నట్లు మ్యాచ్ లో ఓటమి పాలైంది ఆసీస్ జట్టు.

ఆసీస్ బ్యాట్ మెన్ చేసిన తొండాట మీద అంపైర్ కు ఫిర్యాదు చేయలేదెందుకు? అని ప్రశ్నిస్తే.. ఈ సిరీస్ తో పాటు వరల్డ్ కప్ ఆడాల్సిన వేళ.. విషయాన్ని పెద్దది చేయలేదని సెలవిచ్చాడు. ఏమైనా.. ఇంగ్లండ్ టార్గెట్ గా పెట్టిన 209 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా బ్యాట్ మెన్లు ఎంతలా ప్రయత్నించినా తొమ్మిది పరుగుల దూరంలో వారి చేధన ఆగింది. తొండి ఆటకు తుది ఫలితం ఇలానే ఉంటుంది మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.