Begin typing your search above and press return to search.

నిజాం ఆస్తి కేసు : మునిమనవడు వాటాగా ఎన్ని కోట్లు అడుగుతున్నాడంటే ?

By:  Tupaki Desk   |   30 July 2020 12:30 PM GMT
నిజాం ఆస్తి కేసు : మునిమనవడు వాటాగా ఎన్ని కోట్లు అడుగుతున్నాడంటే ?
X
నిజాం ఆస్తుల కేసు ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ కేసుకి ఓ పరిష్కారం దొరికింది అని అనుకున్న ప్రతిసారి కూడా ఎదో ఒక కొత్త సమస్య వస్తూనే ఉంది. లండన్ కోర్టులో గత కొన్నేళ్లుగా వాదనలు జరుగుతూనే ఉన్నప్పటికీ పరిష్కారం మాత్రం దొరకడం లేదు. అసలు ఈ కేసు పుట్టుపూర్వోత్తరాల గురించి ఒకసారి చూస్తే ..

1947లో దేశ విభజన జరిగాక- భారత్‌, పాక్‌ రెండింటిలోనూ కలవకూడదు అని , అప్పటి నిజాం నవాబు మిర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో తనపై భారత సైన్యం దండెత్తుతుందన్న భయంతో ఆయన సుమారుగా 10లక్షల పౌన్ల ఆస్తిని లండన్‌ లోని నాట్‌ వెస్ట్‌ బ్యాంక్‌ లో భద్రపరిచారు. ఆ తరువాత పరిస్థితులు మారి, భారత్‌ లో హైదరాబాద్‌ సంస్థానం విలీనమైనప్పటికీ ఆ ఆస్తి అలానే లండన్ బ్యాంకు లోనే ఉండిపోయింది. 2013 నాటికి ఆ ఆస్తి ఎన్నో రెట్లు పెరిగి 3.5 కోట్ల పౌన్లకు చేరింది. ఆ మొత్తం తనదేనంటూ పాక్‌ కోర్టుకెక్కింది. కానీ భారత ప్రభుత్వంతో చేతులు కలిపిన నిజాం వారసులు ముకరం ఝా, ఆయన సోదరుడు ముఫకం ఝా వాటిపై తమదే హక్కుందని వాదించారు. ఆ ఆస్తి నిజాం వారసులకే చెందుతుందని బ్రిటిష్‌ కోర్టు 2019 ప్రారంభంలో తీర్పునిచ్చి వాటాలు పంచింది.

అయితే , ఇప్పటికి కూడా ఆ కేసు ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఆ తరువాత కూడా 35 మిలియన్ల (రూ. 332 కోట్లు) హైదరాబాద్ ఫండ్ కేసు మలుపులమీద మలుపులు తిరుగుతోంది. భారతప్రభుత్వానికి ,నిజాం మనుమలైన ముకరం ఝా, ముఫక్కం ఝాకు, ఎస్టేట్ అడ్మినిస్ట్రేటర్ కు మధ్య రహస్యంగా కుదిరిన ఒప్పందాన్ని మునిమనవడు ఉస్మాన్ అలీ సవాలు చేసారు. అలాగే మరో మునిమనవడు హిమాయత్ అలీ మీర్జా.. తనకు ఇంగ్లీష్ ఎస్టేట్ లో వాటా ఉందని, తనతల్లి ఫాతిమా , అంకుల్ షాహమత్ అలీ ఝా వాటాలతో బాటు తనకు 12.6 మిలియన్ పౌండ్లు (రూ. 121 కోట్లు) ఇవ్వాలని వాదిస్తున్నాడు.