Begin typing your search above and press return to search.

శృంగారానికి ఒప్పుకుంటే రేప్‌ లు జరగవు కదా..!!

By:  Tupaki Desk   |   1 Sept 2018 11:00 PM IST
శృంగారానికి ఒప్పుకుంటే రేప్‌ లు జరగవు కదా..!!
X
మాదకద్రవ్యాల నిర్మూలన పేరుతో మారణహోమం సృష్టిస్తున్ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టే నిత్యం ఏదో ఒక వివాదం రేపుతునే ఉంటారు. ఎవరేం అనుకున్నా తనకేంటి అనుకునే ఆయన తాజాగా మహిళల విషయంలో ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. అందమైన అమ్మాయిలు, మహిళలు ఉన్నంతవరకూ అత్యాచారాలు తగ్గవని వ్యాఖ్యానించారు.

రోడ్రిగో సొంత పట్టణం డవావోలో ఇటీవలి కాలంలో అత్యాచారాలు పెరిగాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై అక్కడి మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. దేశాధ్యక్షుడి సొంతూరిలోనే ఇలా ఉంటే ఎలా అంటూ నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో డ్యూటేర్టే మాట్లాడుతూ..‘డవావో పట్టణంలో అత్యాచారాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. అందమైన యువతులు, మహిళలు ఎక్కువయ్యే కొద్దీ అత్యాచారాలు పెరుగుతూనే ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ‘పురుషుడు కోరగానే ఏ మహిళ అయినా శృంగారానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. హా..హా..హా.. అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి’ అంటూ మరింతగా అసహ్యకర వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఇలాంటి వివాదాస్పదన - అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2017లో ఓ సారి ఆయన మాట్లాడుతూ.. చిన్నారులపై లైంగిక దాడులను తాను సహించబోననీ - కానీ విశ్వ సుందరి పోటీల్లో నెగ్గినవారిపై రేప్ జరిగితే తనకేం అభ్యంతరం లేదని అన్నారు. అంతకుముందు ఏడాది ఓ సమావేశంలో సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మార్షల్ లా సందర్భంగా మీరు ముగ్గురిని రేప్ చేసినా ఫర్వాలేదు. నేను చూసుకుంటాను’ అనడం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.