Begin typing your search above and press return to search.
ఆఫీసులో కునుకు.. ఇప్పుడిదే ట్రెండ్.. కంపెనీలకు ఓకేనట!
By: Tupaki Desk | 26 Jan 2023 7:00 AM GMTఆఫీసుకు వచ్చింది వెళ్లే వరకు మర యంత్రంగా పని చేయాలే తప్పించి.. అలసటలో కాస్తంత కునుకు తీస్తే దానికి మించిన మహాపరాధం మరొకటి లేదన్నట్లుగా గగ్గోలు పెట్టటమేకాదు.. ఉద్యోగాల్లో నుంచి తీసేసే యవ్వారాలు చాలానే చూసి ఉంటాం.మరికొన్ని సంస్థల్లో అయితే.. ఇలా కునుకు తీసే వారి ఫోటోల్ని.. వీడియోలోని తీసి ఆట పట్టించటమే కాదు.. బాస్ కు షేర్ చేసుకొని పైశాచిక ఆనందాన్ని పొందేటోళ్లకు తక్కువ ఉండదు.
ఎంత విశ్రాంతి తీసుకొని ఆఫీసుకు వెళ్లినా.. ఎడతెగని పని.. లంచ్ తర్వాత కాస్తంత మగత కమ్మేయటం చాలామందిలో చూస్తుంటాం. ఈ కారణంగానే లంచ్ తర్వాత పని మందగొడిగా సాగటం చాలామందికి అనుభవమే. ఇలాంటి ఇబ్బందులు ఇకపై తగ్గిపోవటం ఖాయమంటున్నారు. దీనికి కారణం.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్నిగుర్తించిన కొన్ని కంపెనీలు.. ఉద్యోగులు కాస్తంత సేపు కునుకు తీసి.. రీఫ్రెష్ అయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
కరోనా పుణ్యమా అని దీర్ఘకాలం పాటు వర్కు ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించిన కంపెనీలు.. ఇటీవల కాలంలో ఆఫీసులకు తప్పనిసరిగా రావాలంటూ హుకుం జారీ చేస్తున్నాయి. వర్కు ఫ్రం హోం వేళ.. ఒక తరహా జీవనవిధానానికి అలవాటు పడిన ఉద్యోగులకు ఆఫీసులకు వెళ్లి పని చేయటం మహా తలనొప్పిగా మారింది. దీంతో.. ఉద్యోగుల ఇబ్బందుల్ని కొన్ని కంపెనీలు గుర్తించి.. వారికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
పని మధ్యలో షార్ట్ స్లీప్ ఇన్ ఆఫీసు అనే కొత్త విధానానికి తెర తీస్తున్నారు. ఇందుకోసం ఆఫీసులోనే చిన్నపాటి న్యాప్ తీసుకోవటానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి ఏర్పాట్లతో ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని భావిస్తున్నారు. తాజాగా ఫర్నిచర్ కంపెనీ వేక్ ఫిట్ తమ ఉద్యోగుల కోసం రైట్ టు న్యాప్ అంటూ ఒక కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చి.. ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ప్రతి ఉద్యోగి మధ్యాహ్నం 2గంటల నుంచి 2.30 గంటల మధ్యలో అధికారికంగా కునుకు తీసే వెసులుబాటును తీసుకొచ్చింది.
ఈ కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చిన కంపెనీ ల్లో లీసియస్.. సింప్లీ లెర్న్.. సాల్వ్.. నో బ్రోకర్.. రేజర్ పే లాంటి కంపెనీలు కునుకు తీసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. చిన్నపాటి న్యాప్ తో పాటు.. కాసేపు వాకింగ్ చేసే సౌకర్యంతో పాటు.. ధ్యానం చేసే వెసులుబాటును తీసుకొచ్చాయి. వర్కు ఫ్రం హోం నుంచి ఆఫీసుకు ఉద్యోగుల్ని తీసుకొచ్చేందుకు ఈ తరహా వెసులుబాట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.