Begin typing your search above and press return to search.

ఢిల్లీ అల్లర్లపై బీజేపీ తెస్తున్న అస్త్రమితడే

By:  Tupaki Desk   |   28 Feb 2020 8:15 AM GMT
ఢిల్లీ అల్లర్లపై బీజేపీ తెస్తున్న అస్త్రమితడే
X
ఢిల్లీ అల్లర్లు, శాంతి భద్రతల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా.. వ్యతిరేకంగా సాగిన ఈ అల్లర్లలో బీజేపీ నేతల ప్రమేయం ఉందని తెలిసినా వారిపై ఇంత వరకూ యాక్షన్ తీసుకోలేదు.. పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. దీనిపై దుమారం రేగుతున్న వేళ బీజేపీ తప్పుదిద్దుకునే చర్యలకు ఉపక్రమించింది.

ఇటీవలే ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ను బదిలీ చేసి కేంద్రంలోని బీజేపీ ఇరుకునపడగా.. తాజాగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా స్ట్రిక్ట్ ఆఫీసర్ ను అపాయింట్ చేసింది.

ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలను అదుపు చేయడంలో ప్రస్తుత ఢిల్లీ కమిషనర్ అమూల్య పట్నాయక్ ఘోరంగా విఫలయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. కేజ్రీవాల్ ను కంట్రోల్ చేయడానికి కేంద్రం తమ మాట వినే అమూల్యను పెట్టిందని.. ఆయన బీజేపీకి సపోర్టుగా అసమర్థత బయటపెట్టుకున్నారని విమర్శలు చెలరేగాయి. కాగా సీపీ అమూల్య శనివారం పదవీ విరమణ చేయనున్నారు.

దీంతో అమూల్య పట్నాయక్ స్థానంలో కేంద్రం స్ట్రిక్ట్ ఆఫీసర్ ను తెచ్చింది. సీఆర్పీఎఫ్ నుంచి స్పెషల్ కమిషనర్ (శాంతిభద్రతలు)గా హోంమంత్రిత్వశాఖ ఎస్ఎన్ శ్రీవాస్తవను ఇటీవలే తీసుకొచ్చింది. కొద్దిరోజులకే శ్రీవాస్తవను తాజాగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా బదిలీ చేశారు. తాజాగా ఢిల్లీలో చెలరేగిన అల్లర్లను కంట్రోల్ చేయడానికి శ్రీవాస్తవను డిల్లీ పోలీస్ కమిషనర్ గా బీజేపీ ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం.