Begin typing your search above and press return to search.

గంగూలీని మ‌ర‌పిస్తున్న మంద‌న‌!

By:  Tupaki Desk   |   30 Jun 2017 12:32 PM GMT
గంగూలీని మ‌ర‌పిస్తున్న మంద‌న‌!
X
భార‌త్‌ లో మ‌హిళ‌ల క్రికెట్‌ కు ప్రాధాన్య‌త చాలా త‌క్కువ‌. ప్ర‌స్తుతం మ‌హిళ‌ల క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగుతోంది. ఈ విష‌యం చాలామందికి తెలియదు. ఒక‌వేళ తెలిసినా అమ్మాయిల క్రికెటర్‌ ను చూసేందుకు చాలామంది పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే అమ్మాయిల క్రికెట్‌ లో ధ‌నాధ‌న్ షాట్లు ఉండ‌వు, వారి ఆట‌లో వేగం ఉండదు, భారీ సిక్స‌ర్లు ఉండవు, ఫీల్డింగ్‌ లో నెమ్మదిగా కదులుతారు. కానీ, భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు ఓపెన‌ర్ స్మృతి మంద‌న ఆటతీరును చూస్తే చాలా మంది త‌మ అభిప్రాయాల‌ను మార్చుకోవాల్సిందే!

సౌరవ్ గంగూలీకి వీరాభిమాని అయిన ఈ మ‌రాఠా అమ్మాయి ప్రస్తుతం భారత మహిళల జట్టులో ఓపెనర్‌ గా రాణిస్తోంది. 2017 వరల్డ్ కప్‌ లో ఇంగ్లండ్‌ పై 72 బంతుల్లో 90 ప‌రుగులు చేసింది. బుధ‌వారం వెస్టిండీస్‌ తో జ‌రిగిన మ్యాచ్‌ లో అజేయంగా 106 ప‌రుగులు చేసింది. మంద‌న అద్భుత‌మైన‌ డ్రైవ్‌ లు - పవర్ ఫుల్ షాట్లతో దాదాను మ‌ర‌పిస్తోంది. గంగూలీలాగా మిడ్‌ వికెట్‌ మీద సిక్స్‌ లు కొట్టడం అంటే ఆమెకు ఇష్టం. ఈమె కుటుంబానికి క్రికెట్ నేప‌థ్యం ఉంది.

ముంబైలో పుట్టి సంగ్లిలో పెరిగిన ఆమె తండ్రి శ్రీనివాస్‌ - సోదరుడు శ్రవణ్‌ నుంచి స్ఫూర్తి పొందింది. తండ్రి శ్రీనివాస్‌ - సోదరుడు శ్రవణ్‌ లు జిల్లా స్థాయి క్రికెటర్లు. తొమ్మిదేళ్లకే మహారాష్ట్ర అండర్‌-15 జట్టులో చోటు సంపాదించిన ఆమె.. 11 ఏళ్లకే అండర్‌-19 జట్టులో స్థానం సంపాదించింది. అండర్‌-19 టోర్నీలో గుజరాత్‌ తో ఆడిన మ్యాచ్ లో 150 బంతుల్లో 224 పరుగులు చేసి టీమిండియాలో స్థానం సంపాదించింది.

2013లో బంగ్లాదేశ్ పై వన్డే అరంగేట్రం చేసిన ఆమె - ఆసీస్ పర్యటనలో చేసిన సెంచరీతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో హోబర్ట్‌ లో 109 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ చేసి జట్టులో తన చోటుని సుస్థిరం చేసుకుంది. బిగ్ బాష్ లీగ్‌ లో హర్మన్ ప్రీత్ తర్వాత స్థానం సంపాదించిన భారతీయ క్రీడాకారిణిగా స్మృతి నిలిచింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/