Begin typing your search above and press return to search.

ఒకప్పుడు మెక్ డొనాల్డ్ లో క్లీనర్ గా పనిచేసిన స్మృతి ఇరానీ

By:  Tupaki Desk   |   26 March 2023 12:00 PM GMT
ఒకప్పుడు మెక్ డొనాల్డ్ లో క్లీనర్ గా పనిచేసిన స్మృతి  ఇరానీ
X
ఇప్పుడు ఈమె దేశాన్ని పాలించే కేంద్రమంత్రి.. కానీ ఒకప్పుడు ఓ షోరూంలో సఫాయి కార్మికురాలిగా చేసిందని తెలుసా? కానీ ఇది నిజంగా నిజం.. ప్రముఖ భారతీయ రాజకీయ నాయకురాలు, మాజీ మిస్ ఇండియా అయిన స్మృతి ఇరానీ, విజయవంతమైన పబ్లిక్ ఫిగర్ కావడానికి ఆమె ఎన్నో కష్టాలు అనుభవించానని తాజాగా ఇంటర్వ్యూలో పేర్కొంది. ఒక స్ఫూర్తిదాయకమైన తన కష్టాలు కడగండ్లు చెప్పుకుంది.

మిస్ ఇండియా పోటీకి ఎంపికైన తర్వాత పోటీలో పాల్గొనడానికి తనకు ప్రత్యేకంగా ₹1లక్ష డబ్బు అవసరమయ్యాయని ఆమె వెల్లడించింది. ఆర్థిక సహాయం కోసం స్మృతి తన తండ్రిని ఆశ్రయించగా, ఆమెకు అవసరమైన నిధులను అందించడానికి ఆయన అంగీకరించాడని.., అయితే వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని నాన్న కండీషన్ పెట్టినట్టు ఆమె తెలిపింది.

తన అప్పును నెరవేర్చాలని నిశ్చయించుకున్న స్మృతి మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో క్లీనర్‌గా పని చేయడం ప్రారంభించింది. నెలకు ₹1500 తక్కువ జీతం వచ్చినా చేసింది.

కెరీర్ తొలినాళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, స్మృతి తన తండ్రి ఋణం తీర్చుకోవడంలో నిబద్ధతతో స్థిరంగా ఉండి పనిచేసింది. చివరికి విజయం సాధించింది.

స్మృతి కథ తన లక్ష్యాలను సాధించడంలో కృషి, పట్టుదల ప్రదర్శించింది. తన శక్తికి నిదర్శనం ఇదే అంటూ తాజాగా ఇంటర్వ్యూలో పేర్కొంది. జీవితంలో విజయం సాధించాలని ఆకాంక్షించే చాలా మందికి ఆమె ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.