Begin typing your search above and press return to search.
హైదరాబాద్‌లో సిగరెట్ తాగుతున్నారా మీరు డేంజర్‌లో ఉన్నట్లే
By: Tupaki Desk | 1 Feb 2022 12:30 AM GMT`ధూమపానం ఆరోగ్యానికి హానికరం` ఈ విషయం మన చిన్నతనం నుంచి తెలుసు. సినిమా చూస్తున్నప్పుడు ఈ మేరకు హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ, కొందరు పొగరాయుళ్లు సిగరెట్లు తాగడం ఆపివేయట్లేదన్న సంగతి తెలిసిందే. `బహిరంగ ధూమపానం నిషేధం` అనే ఆర్డర్ ఉన్నప్పటికీ కేవలం అది ఆదేశం వరకే సరిపోయింది. అయితే, ఇప్పుడు హైదరాబాద్‌లో సిగరెట్ తాగే వారికి కొత్త షాకింగ్ న్యూస్. అదేంటి సిగరెట్ ఎవరు తాగిన ఆరోగ్యానికే నష్టం కదా? ప‌్రత్యేకంగా హైదరాబాద్ అనే ఎందుకు ప్రస్తావిస్తున్నారు అనేది మీ సందేహం అయితే... తాజాగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన హెచ్చరిక గురించి తెలుసుకోవాల్సిందే.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో డ్రగ్స్, మత్తు పదార్థాల చెలామణికి బ్రేక్ వేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డ్రగ్స్ , గంజాయి దందాపై ఉక్కుపాదం మోపాల్సిందిగా సీఎం కేసీఆర్ కఠిన ఆదేశాలను ఇటు మంత్రులకు అటు అధికారులకు ఆయన ఇచ్చారు. అంతేకాకుండా డ్రగ్స్ వినియోగం పబ్బుల్లో ఎక్కువగా ఉందని దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో తాజాగా హైదరాబాద్‌లో పబ్బుల యాజమానులతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించారు.
పబ్బుల్లో కొందరు అక్రమ దందాలు చేస్తున్నారని , డ్రగ్స్ వాడకంపై తమకు సమాచారం వచ్చిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పబ్ యజమానులు డ్రగ్స్ వాడకంపై దృష్టి పెట్టాలని, పబ్బుల్లో డ్రగ్స్ వాడకం వెలుగులోకి వస్తే ఆ పబ్బులను నిరభ్యంతరంగా సీజ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. పబ్స్ వచ్చిన వారు ఎన్ని సిగరెట్‌లు తాగుతున్నారు... ఒక సిగరెట్‌ను మరో నలుగురు పంచుకుంటున్నారా అనే వాటిపై దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. అంటే, హైదరాబాద్ పబ్బుల్లో సిగరెట్ తాగడంపై కూడా ప్రత్యేక దృష్టి ఉంటుందన్నట్లు. ఇదిలాఉండగా, పబ్బుల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు మీ దృష్టి వస్తే 18004252523 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని మంత్రి సూచించారు.