Begin typing your search above and press return to search.
రోజు పొగతాగే వారి ఊపిరితిత్తులు ఎలా ఉంటాయంటే..!
By: Tupaki Desk | 21 Nov 2019 1:30 AM GMTపొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. మీకే కాదు మీ పక్కన ఉన్నవారికి కూడా స్మోకింగ్ హాని చేస్తుంది అని మనం యాడ్స్ చూస్తూనే ఉంటాం. కానీ - ఆ యాడ్స్ చూసినంత సేపు కూడా పొగ పీల్చకుండా ఉండలేని వారు చాలామంది ఉన్నారు. అలాగే పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రతి సిగరెట్టు పెట్టెపై రాసి ఉంటుంది. కానీ , రోజుకి పెట్టెలు పెట్టెలు కాల్చేస్తుంటారు. పొగ తాగడం వల్ల ముఖ్యంగా శ్వాసవ్యవస్థ - ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా పొగతాగడం వల్ల ఏడాదికి 8 మిలియన్ మంది చనిపోతున్నారని వెల్లడించింది.
ఇకపోతే , పొగ తాగడం వల్ల మనుషులు చనిపోతారని డాక్టర్స్ చెప్పారు. కానీ , ఇప్పటి వరకు పొగ తాగే వ్యక్తి ఊపిరితిత్తులు నిజంగా ఎలా మారతాయో ఎవరికి తెలియదు. కేవలం ఉహాజనితమైన ఫోటోలని మాత్రమే ఇప్పటివరకు మనం చూసేవారం కానీ - తాజాగా చైనా కి చెందిన డాక్టర్స్ .. పొగతాగే వ్యక్తుల ఊపిరితిత్తులు ఎలా ఉంటాయో లైవ్ లో చూపించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
పూర్తి వివరాలు చూస్తే .. చైనాలో ఓ వ్యక్తి ఈ మద్యే మృతి చెందాడు. అయితే తన మరణం తర్వాత తన శరీర అవయవాలను దానం చేస్తున్నట్లు బతికుండగానే రాసిచ్చాడు. దీనితో అతను చెప్పినట్లుగానే అవయవాలు సేకరించేందుకు వైద్యులు అతని శరీరంను కోశారు. ఒక్కో అవయవం శరీరం నుంచి వేరు చేస్తూ వచ్చారు. కిడ్నీలు - కళ్లు - మెదడు - ఇక చివరిగా ఊపిరితిత్తుల దగ్గరకు వచ్చేసరికి వైద్యులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకు అంటే అవి మసిపూసినట్లుగా నల్లగా తయారయ్యాయి. దీనితో చనిపోయిన వ్యక్తికి పొగతాగే అలవాటుందని గ్రహించారు. కుటుంబ సభ్యులని అడగ్గా .. గత 30 ఏళ్లుగా రోజుకో సిగరెట్ ప్యాకెట్ తాగేవాడని చెప్పారు. ఇకపోతే ఊపిరితిత్తులు అతని శరీరం నుండి వేరు చేస్తున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. అలాగే ఇప్పటివరకు ఆ వీడియోకు 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి.