Begin typing your search above and press return to search.
నిద్రకూడా పట్టడం లేదు.. నేనింకా షాక్‌లో ఉన్నా.. ఆరోపణలపై స్మిత్ స్పందన..!
By: Tupaki Desk | 14 Jan 2021 2:30 PM GMTఆస్ట్రేలియా టూర్లో భాగంగా ప్రస్తతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే టీ20, వన్డే సిరీస్ కాస్త ప్రశాంతంగానే సాగింది. కానీ టెస్ట్ క్రికెట్ స్టార్ట్ అయ్యాక పలు వివాదాస్పద అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఆటగాళ్లు నోటికి పనిచెప్తున్నారు. గత టెస్ట్మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్‌పై.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాటల దాడి చేసిన విషయం తెలిసిందే.
దీనికి రవిచంద్రన్ కూడా దీటుగానే బదులిచ్చారు. అయితే సిడ్నీ టెస్టు నాలుగో ఇన్సింగ్‌లో వికెట్ వద్ద టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పెట్టుకున్న గార్డ్ మార్క్‌ను ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ చెరిపేస్తూ కనిపించిన వీడియో పెద్ద దుమారమే రేపింది. దీనిపై క్రికెట్ అభిమానులు స్మిత్‌ను తీవ్రంగా విమర్శించారు. అతడిలో క్రికెట్ స్పిరిట్ లోపించిందని ఆరోపించారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఆసిస్ క్రీడాకారులు స్పందించారు.
పంత్ పెట్టుకున్న మార్క్‌ను.. స్మిత్ చెరపలేదని.. అతడు ప్రతి మ్యాచ్‌లోనూ అలాగే చేస్తాడని సహచర ఆటగాళ్లు చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం ముగిసిపోలేదు. తాజాగా ఈ వివాదంపై స్మిత్ నేరుగా స్పందించారు. ‘ ఈ వివాదం విని నేను నిజంగా షాక్ అయ్యాను. నాకు నిద్రకూడా పట్టడం లేదు. నేను ప్రతిమ్యాచ్‌లోనూ అలాగే చేస్తుంటా. నా మీద ఇటువంటి ఆరోపణలు రావడంతో ఎంతో బాధపడ్డా’ అంటూ స్మిత్ పేర్కొన్నారు. అయితే స్మిత్ వివరణతోనైనా.. అతడిపై విమర్శలు ఆగుతాయేమో వేచిచూడాలి.