Begin typing your search above and press return to search.

మొబైల్ ఫోన్ల ధ‌ర‌లు పెరిగిపోతాయ‌ట‌

By:  Tupaki Desk   |   2 Feb 2017 7:27 AM GMT
మొబైల్ ఫోన్ల ధ‌ర‌లు పెరిగిపోతాయ‌ట‌
X
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ బ‌డ్జెట్లో ప్ర‌సంగం ప్ర‌కారం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఫోన్ల ధ‌ర‌లు పెరుగుతాయని అంటున్నారు. మొబైల్ ఫోన్లలో వాడే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీ)లను దిగుమతి చేసుకోవడంపై పన్ను భారం విధించడంతో సమీప భవిష్యత్తులో ఇండియాలో తయారయ్యే ఫోన్ల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడం కోసం మన దేశంలోనే పీసీబీలను తయారయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోడాన్ని తప్పుపట్టడంలేదు గానీ దిగుమతి చేసుకోవడంపై పన్ను భారం పెంచడం వలన కొంతకాలం వరకూ ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

దేశవ్యాప్తంగా సుమారు 35 కోట్ల మంది సాధారణ (బేసిక్) ఫోన్లు వాడుతున్నారని, మరో 35 కోట్ల మంది ఇంటర్నెట్ సౌకర్యంలేని ఫోన్లు వాడుతున్నారని, పట్టణ ప్రాంతాల్లోని సుమారు 25 కోట్లమంది మాత్రం స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ అంచనా వేసింది. అయితే ఈ ఫోన్లలో వాడే పీసీబీలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రస్తుతం మన దేశంలో పీసీబీల తయారీ మన అవసరాలకు సరిపోయేంతగా లేదు. ఈ పరిస్థితుల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పీసీబీలపై రెండు శాతం మేర స్పెషల్ అడిషనల్ డ్యూటీ (ఎస్‌ ఏడీ) పేరుతో పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. మొబైల్ ఫోన్ల ధరలో దాదాపు 60% వరకు పీసీబీ ధర ఉంటుంది. వీటి దిగుమతిపై రెండు శాతం పన్ను విధించడం వల్ల అంతిమంగా ఫోన్ల ధరలు పెరుగుతాయి. కాగా.. ద్రవ్య చలామణిలో పారదర్శకతను పెంపొందించడానికి ఒకవైపు భీమ్ లాంటి మొబైల్ అప్లికేషన్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మరోవంక మొబైల్ ఫోన్ల ధరలు పెరిగేందుకు దోహదపడే నిర్ణయం తీసుకోవడం వినియోగదారులను విస్మయానికి గురిచేసింది. ఒకవంక మీ మొబైల్ ఫోనే మీ బ్యాంకు అని స్వయంగా ప్రధాని ప్రకటిస్తుంటే ఆర్థికమంత్రి జైట్లీ మాత్రం ఆ మొబైల్ ఫోన్లను వినియోగించడం భారంగా మార్చే ప్రకటన చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇదిలాఉండ‌గా...కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ లో స్టార్టప్ కంపెనీలకు ఊర ట కల్పించారు. కంపెనీ ప్రారంభించిన మొదటి ఏడేళ్ల‌లో మూడేళ్ల‌పాటు పన్ను రాయితీని వినియోగించుకోవచ్చని తెలిపారు. అంతకుముందు మొద టి ఐదేళ్ల‌లో మూడేళ్ల‌పాటు పన్ను రాయితీ వినియోగించుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం దాన్ని ఏడేళ్ల‌కు పొడిగించారు. స్టార్టప్‌ ల నష్టాలను తగ్గించేందుకు కంపెనీ నిజమైన ప్రమోటర్లకు 51 శాతం ఓటింగ్ హక్కులు ఉండాలనే నిబంధనను సడలించారు. కొన్నేళ్ల‌పాటు లాభాలు రాని స్టార్టప్ కంపెనీలకు ఈ సడలింపులు ఊరట కలిగిస్తాయి. ప్రస్తుతం కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ)ను తొలగించడం లేదా తగ్గించడం సాధ్యం కాదని, కానీ భవిష్యత్తులో అమలు చేసే ఉద్దేశంతో 15 ఏండ్లపాటు ఎంఏటీని ముందుకు జరుపుకోవచ్చని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇంతకు ముందు ఇది పదేళ్లు ఉండ‌గా దాన్ని మరో ఐదేళ్ల‌పాటు పొడిగించారు. రూ.50 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన చిన్న వ్యాపార సంస్థలు కంపెనీలుగా మారేందుకు వెసులుబాటును కల్పిస్తూ ఆదాయపన్నును 25 శాతం మేర తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ లో ప్రకటించిన సడలింపులపై స్టార్టప్ కంపెనీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎంఏటీ నుంచి మినహాయింపు లభిస్తుందని కంపెనీ వర్గాలు భావించాయి. అయితే ప్రభు త్వం దాన్ని 10 నుంచి 15 ఏండ్లకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఇది కూడా సానుకూల నిర్ణయమేనని స్టార్టప్ వర్గాలు భావిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/