Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్ ...!
By: Tupaki Desk | 6 Jun 2020 6:30 AM GMTప్రస్తుతం ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తున్న మహమ్మారి కారణంగా ప్రపంచంతో పాటుగా మన దేశంలో కూడా లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూసివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం విద్యార్ధులందరూ విద్యను ఆన్‌లైన్ ద్వారానే అభ్యసిస్తున్నారు. ఈ తరుణంలో నిరుపేద విద్యార్ధులపై ఆర్ధిక భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న 9వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సమయంలో గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించటానికి శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రూ. 5 వేల నుంచి రూ. 6 వేల విలువ చేసే స్మార్ట్ ఫోన్లను అందించనున్నారు. సొసైటీ పరిధిలో 60 వేల మంది విద్యార్ధులు చదువుతుండగా.. వారిలో 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. దీనితో మిగిలిన విద్యార్ధులకు ఆన్ లైన్ విద్యలో ఎటువంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే సొసైటీ ఈ నిర్ణయం తీసుకుంది.ఇదిలా ఉంటే విశాఖపట్నం లో రెండు, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరం లో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా ఐఐటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.