Begin typing your search above and press return to search.

కిచెన్ లో సెల్ ఫోన్ తీసింది.. చేజారి కాగుతున్న నూనెలో పడింది..తర్వాత?

By:  Tupaki Desk   |   4 March 2023 10:01 AM GMT
కిచెన్ లో సెల్ ఫోన్ తీసింది.. చేజారి కాగుతున్న నూనెలో పడింది..తర్వాత?
X
వైరల్ గా మారిన ఈ వీడియోను చూస్తే.. బోలెడన్ని భావోద్వేగాలు ఖాయం. ఈ వీడియోను చూసినంతనే కొందరు అయ్యో.. అంటూ కంగారు పడితే.. మరికొందరు భలే జరిగిందంటూ ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు. మరికొందరు.. మరి ఆ తర్వాతేమైందన్న సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అందరిని ఆకర్షిస్తున్న ఈ చిట్టి వీడియోలోని మ్యాటర్ అందరిని ఇట్టే కనెక్టు చేస్తోంది. సాధారణంగా రెస్టారెంట్ కిచెన్ లో పని చేసే వారిని మొబైల్ ఫోన్లతో అడుగు పెట్టనివ్వరు. కానీ.. ఏం జరిగిందో కానీ ఈ వీడియోలోని మహిళ తన జేబుల్లో స్మార్ట్ ఫోన్ పెట్టుకొని కిచెన్ లో పని చేస్తోంది.

అంతలోనే ఏదో నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికే పొయ్యి దగ్గర పని చేస్తున్న ఆమె.. చేతిలోకి స్మార్ట్ ఫోన్ ను తీసుకుంది. చేతిలోకి తీసుకున్నంతనే చేజారి.. ఫోన్ కాస్తా పక్కనే మరుగుతున్న నూనెలోకి పడిపోయింది.

ఆ వెంటనే ఆమె.. పటకారతో ఫోన్ ను నూనెలో నుంచి బయటకు తీసింది. మొత్తం పదిహేను సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. చేజారిన స్మార్ట్ ఫోన్ నూనెలో పడిపోవటం.. దాన్ని బయటకు తీయటానికి కేవలం ఆరేడు సెకన్ల సమయమే తీసుకున్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

కాగే నూనెలో పడ్డ స్మార్ట్ ఫోన్ ఫ్రై అయిపోయినట్లుగా అయిపోయింది. బయటకు తీసిన పోన్ ను ఆమె పక్కకు తీసుకెళ్లటంతో వీడియో ముగిసింది. మరి.. ఆ తర్వాతేమైందన్న సందేహం చాలామందిని వెంటాడుతోంది.

ఇంకేం అవుతుంది. ఫోన్ పనికి రాకుండా పోతుంది. అంత వేడిలో పడ్డాక ఇంకేం పని చేస్తుందని కొందరు తేల్చేస్తుంటే.. అదేం కాదు.. ఇలాంటి వేళలోనే.. బియ్యంలో ఫోన్ ను ఉంచేస్తే అంతో ఇంతో వాడేందుకు వీలుగా ఉంటుందని కొందరు ఉచిత సలహా ఇస్తున్నారు. మరికొందరు.. ఇంకెక్కడి ఫోన్.. అయిపోయిందని తేల్చేస్తున్నారు.

ఫోన్ నూనెలో పడటం.. బయటకు తీయటం అయిపోయింది. ఇంతకీ ఆ నూనెను మార్చేశారా? లేక అలానే వాడేశారా? నూనెలో పడిన ఫోన్ కారణంగా.. ఆ వేడికి స్మార్ట్ పోన్ నుంచి రసాయనాలు విడుదలై ఉంటాయి. ఇంతకీ నూనెను తీసి పారేశారా? లేదా? అన్న సందేహాన్ని వ్యక్తం చేసినోళ్లు ఉన్నారు. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ చేజారిన వేళలో.. సదరు మహిళ ఎక్స్ ప్రెషన్.. అందరిని ఆకట్టుకుంటోంది. అందుకే ఈ చిట్టి వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చెప్పే నీతేమంటే.. కిచెన్ లో ఉన్నప్పుడు.. అది వంట మధ్యలో ఉన్నప్పుడు ఫోన్ ను చేతిలోకి తీసుకోవటానికి మించిన పెద్ద తప్పు మరేం ఉండదని.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.