Begin typing your search above and press return to search.

స్మార్ట్ హోం... ఆరు కాళ్లతో ఆ ఇల్లు నడుస్తుంది!

By:  Tupaki Desk   |   7 Dec 2021 3:16 AM GMT
స్మార్ట్ హోం... ఆరు కాళ్లతో ఆ ఇల్లు నడుస్తుంది!
X
సొంత ఇల్లు... అనేది చాలామందికి డ్రీమ్. సౌకర్యవంతమైన ఇంటి కోసం చాలామంది కలలుకంటారు. అందుకోసం ఎంత కష్టమైన చేస్తారు. అయితే ఇల్లు ఎంత అందంగా ఉంటే... అంత రిచ్ గా ఫీల్ అవుతారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్కెట్ లో కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి.

ఇసుక, సిమెంట్ వంటివి లేకుండా కట్టే ఇళ్ల నుంచి థర్మాకోల్ షీట్స్, ఇతర రెడీమేడ్ షీట్లతో ఇళ్లను రోజుల వ్యవధిలో నిర్మించే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఓ డిజైనర్ నడిచే ఇంటిని రూపొందించారు. అవును నిజమే. ఆ ఇంటికి కాళ్లు ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్లాలనకున్నా కూడా ఆ ఇంటిని తీసుకొని వెళ్లొచ్చు. నడిచే ఈ ఇంటిని ఎలా తయారు చేశారు? ఎవరు రూపొందించారో తెలుసుకుందామా?

ఫ్రాన్స్ లోని యూబిసాఫ్ట్‌ సంస్థలో పనిచేసే ఓ త్రీడీ డిజైనర్ ఈ ఇంటిని రూపొందించారు. ఎంకో ఎన్షెవ్‌ అనే డిజైనర్ తన క్రియేటివిటీతోటి కదిలే ఇంటిని తయారు చేశారు. ఈ ఇంటికి కూర్చీకి ఉంటే చెక్కలాంటి కాళ్లు కాకుండా.... ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే మూవింగ్ లెగ్స్ ను అమర్చారు. ఈ ఇంటికి ఆరు కాళ్లు ఉంటాయి.

ఈ మెకానికల్ లెగ్స్ తో నిర్దేశించిన ప్రాంతానికి వెళ్లవచ్చు. ఇక ఎత్తు పల్లాలు, లోతు వంటి ప్రాంతాల్లోనూ సునాయసంగా దీనిని తీసుకెళ్లవచ్చు. ఇంటి నిర్మాణంలో ఇప్పటికే ఎన్నో కొత్త పోకడలు వచ్చాయి. అయితే ఇలాంటి నడిచే ఇల్లు ఒక రెట్రో–ఫ్యూచరిస్టిక్‌ అని డిజైనర్ చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్ లో కార్లకు బదులు ఈ ఇంటిని తీసుకొని ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్కడికైనా నడిచే ఈ ఇంటిలో ఓ లివింగ్ రూం, బెడ్ రూం, కిచెన్, డైనింగ్ టేబుల్, టెర్రస్, బాత్ రూం, హైక్వాలిటీ ఫర్నీచర్ విత్ టెక్నాలజీ వంటి స్మార్ట్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక ద్విచక్రవాహనాలు, కార్ల కోసం ఇంటి కింది ఏరియాలో పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. ఇకపోతే టెర్రస్ మీద సోలార్ ప్యానళ్లు, వాటర్ ట్యాంక్ ఉంటుంది.

అన్ని సౌకర్యాలతో ఈ ఇంటిని డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది పూర్తిగా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే అన్ని పనులకు ఫినిషింగ్ ఇచ్చి... నిర్మాణం పూర్తి చేస్తానని డిజైనర్ వెల్లడించారు. ఇంకా డిజైనింగ్ స్థితిలో ఉన్న ఈ ఇంటికి ఇప్పటి నుంచే యమా క్రేజ్ పెరిగింది.

నడిచే ఈ ఇంటి టాపిక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఇల్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కార్ల మాదిరి ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగత వాహనాలకు బదులు వీటినే ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది.

ఈ ఇంటి వల్ల పెరుగుతున్న ఇంధన ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఎక్కడికి వెళ్లినా ఆతిథ్యం కోసం అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్ లో ఇలాంటి ఆధునిక ఇళ్లు ఎక్కువగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని త్రీడీ నిపుణులు చెబుతున్నారు.