Begin typing your search above and press return to search.

స్మార్ట్ సిటీ బార్లా : విశాఖకు ఆఖరుకు ఆ బ్రాండ్...?

By:  Tupaki Desk   |   23 July 2022 2:30 AM GMT
స్మార్ట్ సిటీ బార్లా  : విశాఖకు ఆఖరుకు ఆ బ్రాండ్...?
X
విశాఖ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది సిటీ ఆఫ్ డెస్టినీ అనే. విశాఖ అందాల నగరం అని. టూరిజం స్పాట్ అని ఐటీ సిటీ, సినీ రాజధాని ఇలా ఎన్నో పేర్లు విశాఖకు తగిలిస్తూ ఉంటారు.

ఈ ట్యాగ్స్ ని చూసి విశాఖ ముచ్చట పడినది పెద్దగా లేదు కానీ ఇపుడు అదే విశాఖకు ఒక కొత్త బ్రాండ్ ను తెచ్చి మార్చేశారా అనేలా జరుగుతున్న తంతు చూసి జనాలు అయితే మధనపడుతున్నారు, ఫైర్ అవుతున్నారు.

ఏపీలో బార్లకు బార్లా తలుపులు తీసేసిన నేపధ్యంలో టోటల్ స్టేట్ లో అత్యధికంగా బార్లను విశాఖలో ఏర్పాటు చేస్తూ ఆ క్రెడిట్ మొత్తం వైజాగ్ కి రాసి మరీ ఇచ్చేశారు. అంటే విశాఖకు ఇపుడు ఇది కొత్త బ్రాండ్ అన్న మాట. ఏపీలోనే ఎక్కువగా బార్లు విశాఖలోనే ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం గెజిట్ లో స్పష్టం చేయడం గమనార్హం.

నిజానికి ప్రస్తుతం చూస్తే విశాఖలో 109 బార్లు మాత్రమే ఉన్నాయి. ఆ సంఖ్యను ఇపుడు మరో 19 దాకా పెందేసి మొత్తం 120 బార్లను విశాఖకు అంకితం చేస్తున్నారు అన్న మాట. దీంతో విశాఖ సిటీతో పాటు శివారు ప్రాంతాలు అయిన మధురవాడ, పెందుర్తి వంటి చోట్ల కూడా కొత్తగా బార్లు ఏర్పాటు అవుతాయన్న మాట.

దాంతో వారికి కూడా బార్ల ముచ్చట తీర్చిన వారు కూడా అధికారులు అవుతున్నారు. ఇక బార్లకు అనుమతి కావాలంటే కనీసంగా యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ఈ బార్లను తెరచేందుకు పోటీలో పాల్గొనే వారు పది లక్షల రుసుము ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే బార్ ఏర్పాటుకు అనుమతి లభించకపోయినా ఈ పది లక్షలు మత్రం ప్రభుత్వం నుంచి వెనక్కి రావు. అలా రూల్స్ ఫ్రేమ్ చేసి మరీ ఏపీలో నూతన బార్ విధానానికి తెర తీశారు. ఇక ఏపీలో ది బెస్ట్ గా విశాఖను నిలిపేలా బార్ల సంఖ్యను పెంచేశారు.