Begin typing your search above and press return to search.

ఆలియా భట్ కు, నరేంద్రమోడీకి కొంచెమే తేడా!

By:  Tupaki Desk   |   3 March 2021 4:30 AM GMT
ఆలియా భట్ కు, నరేంద్రమోడీకి కొంచెమే తేడా!
X
ట్విట్టర్ లో కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న ప్రధాని నరేంద్రమోడీ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం తేలిపోయారు. ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఎక్కడో ఉండిపోయారు. మోడీని మించి మన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందంజలో ఉన్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మరో గొప్ప మైలురాయికి చేరుకున్నాడు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్‌గా భారతీయ స్టార్ క్రికెటర్ అవతరించాడు.

ఈ ఘనతతో కోహ్లీ దిగ్గజ క్రీడాకారులైన క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, బెయోన్స్, నేమార్ జూనియర్, డ్వేన్ జాన్సన్ మరియు ఇతరుల సరసన చేరాడు. కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వంద మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగిన ప్రపంచం మొత్తం మీద 23వ ప్రముఖుడు కావడం విశేషం.

విరాట్ ఫాలోవర్స్ ను పోల్చి చూస్తే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ట్విట్టర్లో విరాట్ కు నలభై మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. విరాట్ ఫాలోవర్స్ సంఖ్య ప్రతిరోజూ గడిచేకొద్దీ పెరుగుతూనే ఉంటోంది. కరోనా లాక్ డౌన్ కాలంలో ఇది మరింత ఎక్కువగా పెరిగింది.

విరాట్ తరువాత అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వారిలో బాలీవుడ్ నటీమణులు ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్ లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మిలియన్ల మంది ఫాలోవర్లు వీరికి ఉన్నారు.

ఇక నాలుగో స్తానంలో దీపికా పదుకొణె, ఐదో ప్లేసులో నేహా కక్కర్ ఉండగా.. మన భారత ప్రధాని నరేంద్రమోడీ 6వ స్థానంలో నిలవడం గమనార్హం. ఫాలోయింగ్ లో తనకు తిరుగులేదని అనుకుంటున్న మోడీ ఇది అవమానమేనని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక మోడీ ఆరు స్తానంలో నిలవగా.. ఆయన వెనుకాల 7వ స్థానంలో ఆలియా భట్ ఉన్నారు. మోడీని 51.20 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఆలియా భట్ ను కూడా దాదాపు అంతే 51.06 మిలియన్ల మంది ఫాలోఅవుతున్నారు. ఆలియా భట్ కు.. నరేంద్రమోడీకి కొంచెమే తేడా అని అంటున్నారు. ఫాలోయింగ్ లో తిరుగులేదనుకుంటున్న మోడీకి ఈ ఘణంకాలు చూసి ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారట..