Begin typing your search above and press return to search.
రాజాసింగ్ కోసం స్లీపర్ సెల్స్ రెడీ... రంగంలోకి డీజీపీ
By: Tupaki Desk | 21 Feb 2023 9:28 AM GMTబీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు సంచలన పరిణామంతో వార్తల్లో నిలిచారు. తనదైన శైలిలో హిందూ ధర్మం కోసం స్పందించడం ద్వారా హాట్ టాపిక్‌గా ఉండే రాజాసింగ్ ఇప్పుడు అదే రీతిలో టార్గెట్ అయ్యారు.
ఆయన్ను చంపుతామంటూ పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటికే స్లీపర్ సెల్స్ రెడీ అని కూడా చెప్పడం కలకలంగా మారింది.
తనకు వస్తున్న బెదిరింపుల గురించి తాజాగా రాజాసింగ్ ట్విట్టర్లో వివరించారు. 'నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్తాన్ కు చెందిన ఒక మొబైల్ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారు.
తమ స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి' అని ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను రాజాసింగ్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. దీంతో రాజాసింగ్ ట్వీట్ సంచలనంగా మారింది.
కాగా, ఇప్పటికే తనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతపై పలుమార్లు రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం చెడిపోయిందని, తన భద్రత రీత్యా కొత్త కారు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ పాత వాహనాన్నే మరమ్మతులు చేసి ఇస్తున్నారని ఆయన వాపోయారు. ఇటీవల స్వయంగా దాన్ని వాపసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా బెదిరింపులు కలకలంగా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.