Begin typing your search above and press return to search.
ఏకంగా 2 నెలల పాటు నిద్ర..ఇది ఓ వ్యాధే.. చికిత్స కూడా లేదు
By: Tupaki Desk | 30 Oct 2020 11:30 PM GMTచాలామందికి నిద్రలేమి ఓ సమస్య. వేళకు నిద్రపట్టకపోవడంతో స్లీపింగ్ పిల్స్‌ను ఆశ్రయిస్తుంటారు. మరికొందరు మద్యానికి బానిసవుతారు. కానీ లేద్రలేమి అనేది ఓ సాధారణ రుగ్మత. అయితే అతిగా నిద్రపోవడం మాత్రం ఓ వ్యాధి. సాధారణంగా మనిషికి ఎన్ని గంటలు నిద్ర సరిపోతుంది. కానీ క్లీన్ లెవిన్ సిండ్రోమ్ తో బాధ పడేవారికి ఒక్కోసారి పది రోజులు నిద్ర కూడా సరిపోదు. దీనినే స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. మనదేశంలో ఈ వ్యాధి బాధితులు తక్కువగా ఉన్నారు. విదేశాల్లో మాత్రం వీరి సంఖ్య ఎక్కువగానే ఉంది.
ఈ సమస్యతో బాధపడుతున్న అతికొద్ది మందిలో కొలంబియా కు చెందిన షారిక్ తోవర్ అనే యువతి ఒకరు. ఆమె ఓసారి ఏకధాటిగా రెండు నెలల పాటు నిద్రపోయింది. అయితే ఆ సమయంలో ఆమెకు ప్రాణాధారంగా లిక్విడ్ ఫుడ్ ని శరీరం ద్వారా అందించారు.
లండన్‌కు చెందిన నికోల్ (20) అనే యువతి కూడా అతినిద్రతో ఇబ్బందులు పడుతోంది. ఒక్కోసారి ఆమె ఏకంగా 64 రోజుల పాటు నిద్రపోతూనే గడిపింది. ఆమె శరీరంలోని ఫ్లూయిడ్స్ ఇచ్చి బతికించారు డాక్టర్లు. నికోల్ కూడా ‘క్లీన్-లెవిన్ సిండ్రోమ్’ వ్యాధితో బాధపడుతోంది. ఆమె సాధారణంగా రోజులో 18 గంటలు నిద్రపోతూనే ఉంటుంది. చిన్న వయసులో ఆ వ్యాధి గురించి తెలియక నికోల్ కావాలనే ఇంతలా నిద్రపోతోందని అనుకునేవారు తల్లిదండ్రులు. అయితే ఆమె 14వ జన్మదినం తర్వాత ఆమె ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోందని వాళ్లకు తెలిసింది. చూడడానికి చాలా అందంగా ఉండే నికోల్ స్లీపింగ్ టైమ్ ఒక్కోసారి 22 నుంచి 64 రోజుల వరకు ఉంటుంది. ఆ సమయంలో ఎంత లేపినా ఆమె నిద్రలేవదు. ఆకలేసినపుడు మాత్రం నిద్రకళ్లతోనే ఏదోకటి తినేసి పడుకుంటుంది.
తల్లిదండ్రులు ఆమెను నిత్యం కనిపెట్టుకుంటూ ఉండి నీళ్లు బలవంతంగా తాగిస్తారు. 'ఒకసారి పడుకుని లేచాక ఎంత సేపు నిద్రలో ఉన్నానో నాకే తెలియదు. ఎన్నో క్రిస్‌మస్‌లు, పుట్టినరోజులు, వేడుకలు నాకు నిద్రలోనే గడిచిపోయాయి. కుటుంబ సభ్యుల మరణవార్తలు కూడా నాకు తెలియవు’ అని నికోల్ తెలిపింది. ఎంతో అందంగా ఉండే తాను మోడల్ కావాలని అనుకునేదాన్నని నికోల్ తెలిపింది. ఇలాంటి అరుదైన వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మంది బాధపడుతున్నారట. దీనికి ఇప్పటి వరకు చికిత్స లేదు. కానీ క్లీన్ లెనిన్ సిండ్రోమ్‌తో బాధపడేవారికి ఒక్కోసారి 10 రోజుల నిద్రకూడా సరిపోదు.
ఈ వ్యాధికి ఇప్పటికీ చికిత్స అందుబాటులో లేదు.