Begin typing your search above and press return to search.

నిద్ర పోకపోతే సెక్స్ లైఫ్ తగ్గుతుందా?

By:  Tupaki Desk   |   23 Feb 2021 4:30 AM GMT
నిద్ర పోకపోతే సెక్స్ లైఫ్ తగ్గుతుందా?
X
యంత్రం కూడా రోజూ నడిస్తే పాడైపోతుంది. మనిషి కూడా ఓ యంత్రమే. విశ్రాంతి లేకపోతే తొందరగా పైకి పోతారు. అందుకే మనిషి తప్పకుండా రోజుకు 6-8 గంటలు నిద్రపోవాలి. కానీ బిజీ లైఫ్ లో చాలామంది నిద్ర సరిగా పోవడం లేదు.

నిద్రలేమితో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. నిద్ర తక్కువైతే ఏకాగ్రత కోల్పోతారు. తగినంత టైం నిద్ర లేకపోతే గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఎక్కువ. బరువు పెరుగుతారు. డయాబెటిస్ వస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి.

ఇక నిద్ర తగ్గితే సెక్స్ లైఫ్ లో చాలా సమస్యలు వస్తాయి. డిప్రెషన్ బారిన పడుతారు. సెక్స్ తో గాఢమైన నిద్ర, ఒత్తిడి నుంచి ఉపశమనం, ఒంట్లోని క్యాలరీలు ఖర్చు అవడం మాత్రమే కాదు ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే క్రమం తప్పకుండా సెక్స్ చేయాలని సూచిస్తున్నారు.

రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనే వారి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు అవసరమైన హిమోగ్లోబిన్ చక్కగా ఉత్పత్తి అవుతుంది.వృత్తి పరమైన ఒత్తిడులను పడకగదికి తీసుకొస్తే అసలుకే ఎసరు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడిని పారదోలడంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరిచి సమస్యలను అధిగమించే శక్తిని శృంగారం అందిస్తుందని చెబుతున్నారు. మూస దోరణితో సెక్స్ చేయకుండా పడకగదిలో కొన్ని ప్రయోగాలు చేస్తే బోర్ కొట్టదని సూచిస్తున్నారు. ఈ చర్య దంపతులకు మానసికంగా శారీరకంగా ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తుందని సూచిస్తున్నారు.

రాత్రి పూట హెవీ అయిన అన్నం తినడానికి బదులు చాలా మంది చపాతీ, టిఫిన్ లాంటివి తింటుంటారు. వీటికంటే అన్నం తినడమే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే అన్నం తినడం వల్ల చక్కగా నిద్ర పడుతుందని తాజా పరిశోధనలో తేలింది. అన్నం తినడం వల్ల లెప్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుందట.. ఇది మన శరీరంలో బాగా శక్తిని ఖర్చు చేస్తుందట.. కొవ్వు పేరుకుపోకుండా చేస్తుందట.. దీంతోపాటు ఆకలి వేయకుండా ఉంచుతుంది. కనుక రాత్రి పూట నిర్భయంగా అన్నం తినవచ్చు.