Begin typing your search above and press return to search.

భార్య భర్తల ప్రశాంత నిద్రకు 'స్లీప్ డైవోర్స్‌' తప్పనిసరి

By:  Tupaki Desk   |   23 Feb 2023 5:00 AM GMT
భార్య భర్తల ప్రశాంత నిద్రకు స్లీప్ డైవోర్స్‌ తప్పనిసరి
X
మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిందే.. ఇండియాతో పోల్చితే విదేశాల్లో చిన్న పిల్లలకు కూడా ప్రత్యేకంగా బెడ్‌ రూమ్‌ ను కేటాయించి వారిని అందులోనే పడుకోబెడుతారు. అలా ఒంటరిగా పడుకున్న పిల్లల్లో అభద్రతా భావం ఉండక పోవడంతో పాటు సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక వయసుకు రాగానే తమ కాళ్ల మీద తాము నిలబడగలం అనే నమ్మకం వస్తుంది.

ఇప్పుడు భార్య భర్తలు కూడా రాత్రి సమయంలో సాధ్యమైనంత వరకు విడి విడి గా లేదంటే వేరు వేరు రూమ్స్ లో పడుకోవడం మంచిది అనే అభిప్రాయాన్ని నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఒక ఆరోగ్య సంస్థ చేసిన సర్వేలో దంపతులు ప్రశాంత నిద్రకు స్లీప్ డైవోర్స్ తప్పనిసరి అంటూ వెళ్లడి అయ్యింది.

పిల్లల మాదిరిగా పెద్ద వారు కూడా వేరుగా పండుకోవడం అన్ని విధాలుగా మంచిదే అనే అభిప్రాయం ను వారు వ్యక్తం చేస్తున్నారు.

భార్యాభర్తలు కలిసి పడుకోవడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుందని అంతా భావిస్తూ ఉంటారు. అదే సమయంలో ఇద్దరికి సుఖమయ నిద్ర కావాలి అంటే ఖచ్చితంగా స్లీప్ డైవోర్స్ తీసుకోవాల్సిందే అని.. ఇద్దరు ఎవరికి ఇష్టం ఉన్న విధంగా వారు పడుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు.

ఉద్యోగ బాధ్యతలతో తలమునకలై ఉన్న వారు రాత్రి సమయంలో ఖచ్చితంగా సరైన నిద్ర పోవడం అవసరం. అందుకే వారు రాత్రి సమయంలో భాగస్వామితో నిద్రిస్తున్న సమయంలో సరైన నిద్ర పట్టకుంటే స్లీప్ డైవోర్స్ ను తీసుకుని ఒంటరిగా పడుకోవడంలో తప్పులేదు అనేది చాలా మంది అభిప్రాయం.

అమెరికా తో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే స్లీప్ డైవోర్స్ అమలు అవుతుందని.. కొద్ది సమయం ఏకాంతంగా గడిపిన ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించే సమయంలో ఎవరికి వారు అన్నట్లుగా వేరు వేరు బెడ్‌ రూమ్‌ లో లేదా ఒకే రూమ్‌ లో అయినా వేరు వేరుగా పడుకోవడం మంచిది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.