Begin typing your search above and press return to search.
నా తండ్రిది తప్పే కానీ: బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు
By: Tupaki Desk | 23 Feb 2020 1:19 PM GMTగంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి భారతీయ జనతా పార్టీలో చేరారు. తమిళనాడులోని కృష్ణగిరిలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె కమలం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు - మాజీ కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఆమె పార్టీలో చేరారు. ఆమెతో పాటు వేలాది మంది ఇతర పార్టీ కార్యకర్తలు కూడా బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా విద్యారాణి మాట్లాడారు. కులం - మతం వంటి అంశాలతో సంబంధం లేకుండా తాను పేదలు - నిరుపేదల కోసం పని చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో మంచి పథకాలు ప్రవేశ పెట్టారని - వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. వీరప్పన్ కూతురు విద్యారాణి అడ్వోకేట్.
గతంతో వీరప్పన్ తో కలిసి పని చేసినవాళ్లు - అతని ద్వారా మేలు పొందినవాళ్లు వేలాది మంది కూడా బీజేపీలో చేరారు. విద్యారాణికి మురళీధర రావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తన తండ్రి వీరప్పన్ ఎంచుకున్న మార్గం సరైనది కాదని - కానీ ఆయన ఆ మార్గం ఎందుకు ఎంచుకున్నారనేది ప్రధాన అంశమన్నారు. చివరి శ్వాస వరకు తన తండ్రి పేదల కోసమే బతికారన్నారు. కొన్ని వందల గ్రామాలు ఆయనను దేవుడిలా కొలుస్తాయన్నారు. బలహీనవర్గాలు, అడవిబిడ్డలు బాగుండాలనేది ఆయన కోరిక అన్నారు. ఆయన లక్ష్యాన్ని సాధించడం కోసం బీజేపీలో చేరుతున్నానని విద్యారాణి చెప్పారు.
వీరప్పన్ చనిపోయినప్పుడు విద్యారాణి వయస్సు పద్నాలుగేళ్లు. తన తల్లి ముత్తులక్ష్మిని కూడా కేసులు వెంటాడటంతో చెల్లెలు ప్రభతో కలిసి ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ఓ వైపు లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ - మరోవైపు సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. వీరప్పన్ ను అభిమానించే గ్రామాల్లో పేదల సమస్యలపై పోరాడుతున్నారు.
2011లో పెళ్లి విషయంలో హైకోర్టుకు వెళ్లి పతాకశీర్షికలకు ఎక్కారు. నాడు విద్యారాణి.. దీపక్ అనే యువకుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తల్లి ముత్తులక్ష్మి అడ్డు చెప్పడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో వీరి పెళ్లికి చట్టబద్ధత ఏర్పడింది. ముత్తులక్ష్మి 2006లోనే రాజకీయాల్లోకి వచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఓ ఉద్యమ సంస్థను ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు తల్లితో ఉన్నవాళ్లు చాలామంది ఇప్పుడు విద్యరాణి వెంట నడుస్తున్నారు.