Begin typing your search above and press return to search.

మండే ఎండలకు తోడయ్యే మంట పుట్టే మాట చెప్పిన వాతావరణ రిపోర్టు

By:  Tupaki Desk   |   11 April 2023 2:50 PM GMT
మండే ఎండలకు తోడయ్యే మంట పుట్టే మాట చెప్పిన వాతావరణ రిపోర్టు
X
చలికాలంలో చలి.. వేసవిలో ఎండలు లేకుండా ఎందుకు ఉంటాయని కొందరంటారు. కానీ.. వేసవిలోనూ కొన్ని సందర్భాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉండే సందర్భాలు.. మరికొన్నిసార్లు ఎండలు తక్కువగా ఉండే పరిస్థితులు మనం చూశాం.

ఈ ఏడాది విషయానికి వస్తే.. ఈసారికి ఎండలు ఎక్కువేనని.. రానున్న మూడు రోజుల్లో మంట పుట్టే మాదిరి ఎండ తీవ్రత ఉంటుందన్న విషయాన్ని ఇప్పటికే వాతవరణ శాఖా అధికారులు చెప్పటం తెలిసిందే.

ఇది సరిపోనట్లు.. తాజాగా స్కైమెట్ రిపోర్టు మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాదికి వర్షాలు తక్కువే అన్న విషయాన్ని స్పష్టం చేసింది. వేసవి అనంతరం వచ్చే వర్షాకాల సీజన్ లో సాధారణం కంటే కూడా తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. లానినా.. ఎల్ నినో ప్రభావంతో కరవు సంభవించటానికి 20 శాతం ఛాన్సులు ఉన్నట్లుగా సదరు నివేదిక వెల్లడించింది.

గడిచిన నాలుగేళ్లుగా దేశంలో సాధారణం.. అంతకంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. కానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడనున్నట్లుగా నివేదిక వెల్లడించింది. ఈసారి సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైతే.. వ్యవసాయరంగంలో ఇబ్బందులు ఎదురవుతాయని.. పంట ఉత్పత్తి మీద ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పటికే నిత్యవసర ధరలుపెరిగిన నేపథ్యంలో.. ఈ కరవు పరిస్థితుల కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు మరింతగా పెరగటం ఖాయమని చెప్పాలి.