Begin typing your search above and press return to search.

వారెవ్వా..బెలూన్ తో నడిచే స్కై మెషిన్..రామగుండం యువకుడి అద్భుతం

By:  Tupaki Desk   |   24 Sep 2020 11:30 AM GMT
వారెవ్వా..బెలూన్ తో నడిచే స్కై మెషిన్..రామగుండం యువకుడి అద్భుతం
X
బెలూన్ తో నడిచే స్కై మెషిన్..వినడానికే వింతగా ఉంది కదా..బెలూన్ తో ట్రైనర్ల సాయంతో ఆకాశాన్ని కొంతమేర చుట్టేయచ్చు. కానీ రామ గుండానికి చెందిన యువకుడు రుపొందించిన స్కై డ్రైవ్ మెషిన్ నూతన అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఆ స్కై డ్రైవ్ మెషిన్ గాల్లో చక్కర్లు కొట్టే వీడియోలు చూసి అర్జున్ ప్రతిభను అంతా మెచ్చుకుంటున్నారు. ప్రపంచంలో 1903 సంవత్సరానికి ముందు రవాణా వ్యవస్థ పెద్దగా లేదు. గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లలో ఎక్కి తిరిగేవారు. ఆ తర్వాతి కాలంలో సైకిళ్లు, రిక్షాలు వచ్చాయి. అలా ఎప్పటి కప్పుడు రవాణా సాధనాలు మనిషి కనిపెడుతూ ముందుకు సాగాడు. 1903లో అమెరికాకు చెందిన రైట్ బ్రదర్స్ ఏకంగా గాలిలో ఎగిరే విమానాలను కనిపెట్టారు. 1904, 1905 సంవత్సరాల్లో విమానాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విమాన రంగంలో పలు మార్పులొచ్చాయి. పలు నూతన ఆవిష్కరణలు ప్రారంభమయ్యాయి. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ఎన్నోన్నో తయారయ్యాయి.

తాజాగా రామగుండంకు చెందిన అర్జున్ ఓ అద్భుతాన్ని సృష్టించాడు. గాలిలో నడిచే సరికొత్త వాహనాన్ని సృష్టించాడు. ఇంజిన్ కు మూడు టైర్లు అమర్చుకుని ఒక సరికొత్త వాహనాన్ని తయారు చేశాడు. ఆ వాహనంలో ఒకరు కూర్చోవచ్చు. ఆ వాహనానికి గాల్లో స్కై డ్రైవ్ లకు కట్టుకునేటు వంటి పెద్ద బెలూన్ కట్టారు. ముందుగా ఆ వాహనాన్ని కొద్ది దూరం మామూలుగా నడుపుకుంటూ పోగానే ఇంజన్ వెనుక భాగంలో కట్టిన బెలూన్ గాల్లోకి లేచి బ్యాలన్స్ గా నిలుస్తుంది. ఆ సమయంలో అమాంతంగా ఆ వాహనాన్ని గాల్లోకి ఎగిరించగానే అప్పటికే ఎగురుతున్న బెలూన్ల సాయంతో ఆ ఇంజిన్ పైకి వెళ్లడం మొదలవుతుంది.

ఆ బెలూన్ల సాయంతో ఆ వాహనాన్ని అర్జున్ హెలికాప్టర్ తిరిగేంత ఎత్తుకు తీసుకెళ్లి చాలా సేపు ఆకాశంలో చక్కర్లు కొట్టాడు. అచ్చు హెలికాప్టర్ లాగే ఆ వాహనాన్ని నలు దిశలా నడిపాడు. ఆ తర్వాత ఎక్కడి నుంచి టేకాఫ్ తీసుకున్నాడో అక్కడికి తిన్నగా చేరుకొని సురక్షితంగా ల్యాండ్ అయ్యాడు. బెలూన్ల సాయంతో ఆకాశంలో కొంతవరకు స్కై డ్రైవ్ చేయొచ్చు.కానీ అర్జున్ రూపొందించిన స్కై మెషిన్ తో ఏకంగా హెలికాప్టర్ లా ఆకాశాన్ని చుట్టేయచ్చు. అర్జున్ తాజాగా గాల్లోకి ఎగిరి చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో విడుదల చేయగా అది వైరల్ గా మారింది. అర్జున్ ప్రతిభను అంతా మెచ్చుకుంటున్నారు. ఓ కొత్త శాస్త్రవేత్త ఆవిర్భవించారని నెటిజన్లు అభినందిస్తున్నారు.