Begin typing your search above and press return to search.
ఆ పెద్ద మనిషి 'ఆకాశ ఎయిర్' ఫస్ట్ లుక్ వచ్చేసింది
By: Tupaki Desk | 24 May 2022 2:28 AM GMTప్రముఖులు.. సెలబ్రిటీలు.. పారిశ్రామిక తోపులు లాంటోళ్లు విమానయాన సంస్థల్ని ఆరంభించటం.. గురి తప్పటం.. లెక్కలు తేడా రావటం.. చతికిలపడటం లాంటివి ఉదంతాలు ఆకాశయాన రంగంలో చూశాం. అలాంటి ఎదురుదెబ్బల మీద అనుభవంతో పాటు.. పెట్టుబడులు పెట్టే విషయంలో మహా తెలివైన వ్యక్తిగా పేరున్న ప్రముఖుడు రాకేశ్ ఝున్ ఝున్ వాలా. ఆయనతో పాటు విమానయాన రంగంలో తోపులుగా చెప్పే మరో ఇద్దరు కలిసి.. ‘ఆకాశ ఎయిర్’ పేరుతో కొత్త విమానయాన సంస్థను తెర మీదకు తీసుకురావటం తెలిసిందే.
తాజాగా ఆకాశ ఎయిర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆరంజ్.. వైట్.. ఉదా రంగులతో చూసినంతనే మనసును ఆకట్టుకునేలా ఉన్న తమ విమాన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేసి.. అందరిని ఆకర్షించేలా చేశారు. రాకేశ్ తో పాటు చేతులు కలిపిన ఇద్దరు ప్రముఖులు ఎవరంటే.. ఒకరు జెట్ ఎయిర్ వేస్ మాజీ సీఈవో వినయ్ దూబే.. ఇంకొకరు ఇండిగో మాజీ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ లతో కలిసి.. ఈ విమానయాన రంగాన్ని రియాలిటీలోకి తీసుకురానున్నారు. అందరికి అందుబాటు ధరలతో నాణ్యమైన విమానయాన సేవల్ని అందించే లక్ష్యంతో ఆకాశ ఎయిర్ పని చేస్తుందని చెప్పటం తెలిసిందే.
దేశీయంగా విమాన ప్రయాణికులు పెరుగుతునన నేపథ్యంలో రానున్న 20 ఏళ్లలో భారత్ లో దాదాపు వెయ్యి కొత్త విమానాల అవసరం ఉందని అంచనా వేస్తున్న వేళ.. ఈ ముగ్గురు ప్రముఖులతో కూడిన ఆకాశ ఎయిర్.. 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ఆర్డర్ చేసింది. ఈ మేరకు మొదటి విడతగా నాలుగు విమానాల్ని సిద్ధం చేశారు. వచ్చే నెలలో వీటిని ఆకాశ ఎయిర్ కు బోయింగ్ అప్పజెప్పనుంది. జులై నుంచి దేశీయంగా విమాన సేవల్ని ప్రారంభించనన్నారు.
తాజాగా అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ సిటీలోని బోయింగ్ ఫ్యాక్టరీలో డెలివరీకి సిద్ధమైన ఆకాశ ఎయిర్ విమాన ఫోటోను సదరు సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసింది. చూసినంతనే ఇట్టే ఆకర్షించేలా ఉన్న ఈ విమాన సంస్థ విమానాల మొత్తం ఆర్డర్ లో 2023 మార్చి నాటికి 18 విమానాల్ని అందించనుంది. జెట్ ఎయిర్ వేస్ తో కలిసి 2022 మధ్య నుంచి పూర్తి స్థాయి విమాన సేవల్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దేశీయంగా టయర్ టూ, టయర్ త్రీనగరాల్లో విమానయాన సర్వీసుల్ని అందుబాటులోకి తేవాలని ఆకాశ ఎయిర్ భావిస్తోంది.
ఆకాశ ఎయిర్ కు 2021 ఆగస్టులోనే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ వోసీ) లభించింది. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ బోయింగ్ 737మ్యాక్స్ విమానాల్ని నడుపుుకునేందుకు పచ్చజెండా ఊపింది. దేశీయ విమానయాన రంగంలో మరో సంచలనంగా భావిస్తున్న ఆకాశ ఎయిర్ ఎంట్రీతో మరిన్నిమార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.