Begin typing your search above and press return to search.
భారత్ లో భారీ ఉగ్రదాడులకు స్కెచ్.. జైల్లోనే పన్నాగం
By: Tupaki Desk | 30 April 2020 3:01 PM GMTలాక్‌డౌన్‌తో దేశమంతా ఇంటికే పరిమితమైంది. ఇదే అదును భావించిన ఉగ్రవాదులు భారీ కుట్రకు పాల్పడ్డారు. దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే ఆ దాడులకు దేశ రాజధానిలోని తీహార్ జైల్‌లోని పలు ప్రాంతాల్లోని దేవాలయాలలో అమలు చేసేందుకు పన్నాగం పన్నారని తెలిసి దేశం నివ్వెరపోయింది. భారీ కుట్రకు ప్రణాళిక రూపొందించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర కుట్రకు సూత్రధారి హైదరాబాద్‌కు చెందినవాడని సమాచారం.
దేశంలో పలుచోట్ల ఉగ్రవాద దాడులు చేయాలని తీహార్ జైల్‌లో కొందరు వ్యూహం పన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఉగ్రవాది దాడులకు స్కెచ్ వేసినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. జైల్‌లో ఖైదీగా ఉంటూ ఓ వర్గం యువతకు ఈ హైదరాబాదీ ఉగ్ర పాఠాలు బోధిస్తున్నట్లు తేలింది. అయితే దీనికి సంబంధించిన గుట్టును ఇరాన్ దేశానికి చెందిన ఓ జంట బహిర్గతం చేసింది. దీంతో ఒక్కసారిగా దేశంలో అలజడి మొదలైంది.
అయితే స్కెచ్ వేసిన వ్యక్తి ఎవరో కాదు గతంలో ఐసిస్ లో చేరేందుకు సిరియా వెళ్లడానికి ప్రయత్నం చేసి మహారాష్ట్ర లో పోలీసులకు చిక్కిన వ్యక్తే. హైదరాబాద్ కు చెందిన ఆ వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గతంలో అదుపులోకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌పై తీహార్ జైలులో అతడు ఉన్నాడు. అయితే జైల్లో ఉన్నా కూడా అతడు ఉగ్రదాడులకు యత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే జైల్‌లో ఉండే దేశవ్యాప్తంగా పలు దేవాలయాలలో ఉగ్రదాడులు చేయాలని కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీనికి అదే జైల్‌లో ఉన్న ఓ వర్గానికి చెందిన యువకులను రెచ్చగొట్టడం.. వారిలో విద్వేషాలు మొలకెత్తేలా చేస్తున్నాడు. ప్లాన్ ప్రకారం ఆ యువత ఒంటరిగా దాడికి దిగేలా ఉసిగొల్పేందుకు ట్రైనింగ్ ఇస్తున్నాడని నిఘా వర్గాల దర్యాప్తులో తేలింది. అతగాడిని 2018లో తెలంగాణ పోలీసులు కూడా ఓసారి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విధంగా ఉగ్ర దాడులకు కుట్ర పన్నుతున్నాడని తీహార్ జైల్ లో ఉన్న ఇరాన్ దేశానికి చెందిన ఖొరాసన్ మోడ్యూల్ ప్రాంతానికి చెందిన ఓ జంట బయట పెట్టింది. ఉగ్రవాది యాక్షన్ ప్లాన్‌లో మన దేశంలోని పలు దేవాలయాలు ఉన్నట్లు ఈ జంట ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందించింది. ప్రధాన దేవాలయాల్లో భక్తులకు ఇస్తున్న ప్రసాదాలలో విషం కలపాలన్నది అతడి కుట్ర అని ఆ జంట తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో దేశమంతటా ఇంటిలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. జైల్‌లో ఉన్న అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశం ప్రశాంతం గా ఉన్న వేళ ఈ విధంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నడం అందరినీ ఆందోళన రేపింది.