Begin typing your search above and press return to search.
డేరా క్యాంపస్ లో అన్ని వందల అస్తిపంజరాలా?
By: Tupaki Desk | 20 Sep 2017 8:47 AM GMTమరో షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేసిన నేరంలో జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా రాంరహీమ్ అలియాస్ గుర్మిత్‌కు సంబంధించిన సంచలన విషయాలు మరిన్ని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సువిశాలమైన ఆయన డేరా క్యాంపస్ ను తవ్వకాలు జరిపితే మతిపోయే అంశాలు బయటకు రావటం ఖాయమంటున్నారు.
డేరా బాబా క్యాంపస్ లో హత్యలు జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 500 మంది ఆచూకీ కనిపించలేదని.. వారంతా హత్యకు గురై ఉంటారన్న సందేహాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గుర్మీత్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో అధికారులు డేరా ఆశ్రమంలోని ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే సందేహం వచ్చి తవ్వకాలు జరిపితే దాదాపు 600కు పైగా ఆస్తిపంజరాలు డేరా ఆశ్రమంలో బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
దీంతో.. అధికారులు షాక్‌కు గురి అవుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఆస్తిపంజరాలు ఏమిటన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రతి ఆస్తిపంజరం పైనా అందమైన పూల మొక్కలు నాటినట్లుగా చెబుతున్నారు. డేరా ఆశ్రమంలో బయటపడుతున్న ఆస్తిపంజరాలన్నీ మోక్షం కోసం చనిపోయిన వారివన్న మాటను బాబా అనుచరులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రఖ్యాత జర్నలిస్ట్ రామానంద్ తాతియా మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ స్థాయి చానళ్ల నడుమ ఆశ్రమంలో తవ్వకాలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేస్తే మరిన్ని షాకింగ్ అంశాలు బయటకు రావొచ్చని తెలుస్తోంది.