Begin typing your search above and press return to search.

20వ ఓవర్లో సిక్సులు.. ధోనినే టాప్

By:  Tupaki Desk   |   13 April 2023 12:32 PM GMT
20వ ఓవర్లో సిక్సులు.. ధోనినే టాప్
X
ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ ఫినిషర్ మనో ఎంఎస్ ధోనినే.. టీమిండియాకు పదేళ్లకు పైగా ఆడిన అతడు ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించాడు. ఇప్పటికీ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ లో బెస్ట్ ఫినిషర్ గా పేరు పొందాడు. ధోనిలా అంత ఖచ్చితత్వంతో గెలిపించిన ఆటగాడు మరొకరు లేరు. ఐపీఎల్ లోనూ దాన్ని ధోని కొనసాగించడం విశేషం.

20వ ఓవర్లో అత్యధిక సిక్సులు (57) కొట్టిన ప్లేయర్ గా అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పొలార్డ్ (33), రవీంద్ర జడేజా(26), హార్దిక్ పాండ్యా (25), రోహిత్ శర్మ (23) ఉన్నారు. ధోని రికార్డును కొన్నేళ్లపాటు ఎవరూ టచ్ చేసే అవకాశం లేదు.

41 ఏళ్ల ఎంఎస్ ధోని 200 మ్యాచ్‌లలో ఐపీఎల్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహించిన మొదటి కెప్టెన్‌గా కూడా నిలిచాడు. అతని అద్భుతమైన ఫీట్ గురించి అడిగినప్పుడు ధోనీ తన మాజీ భారత సహచరుడు విరాట్ కోహ్లిలా మైలురాళ్ళు సృష్టించడంలో తానే అతడిని మించిన పెద్దవాడిని కాదని వివరించాడు.

"ఇది నా సీఎస్కే కెప్టెన్ గా 200వ మ్యాచ్ అట.. నాకు నిజంగా తెలియదు. మైలురాళ్ళు నాకు ముఖ్యమైనవి కావు, మీరు ఎలా రాణిస్తున్నారు. వాటి ఫలితాలపై ఆధారపడి ఉంటుంది" అని ధోని చెప్పాడు.

కాగా ధోనీ టీం సీఎస్కే ఐపీఎల్ -2023 పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగింది. సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ చేతిలో నిన్న సీఎస్కే ఓడింది. దీంతో రాజస్థాన్ అగ్రస్థానానికి చేరుకుంది.

ఐపీఎల్ 2023 లీగ్ దశలో ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే జట్టు 4 మ్యాచ్‌ల ఆడి నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో కొనసాగుతోంది.