Begin typing your search above and press return to search.

అమెరికాలో బర్త్‌డే పార్టీ : ఆరుగురు టీనేజర్ల కాల్చివేత

By:  Tupaki Desk   |   16 April 2023 7:00 PM GMT
అమెరికాలో బర్త్‌డే పార్టీ : ఆరుగురు టీనేజర్ల కాల్చివేత
X
అమెరికాలోని అలబామాలోని డాడెవిల్లేలో దారుణం జరిగింది. ఓ యువకుడి పుట్టినరోజు పార్టీలో ఆరుగురు టీనేజర్లను కాల్చివేశారు. ఈ సామూహిక కాల్పులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కాల్పులకు గల కారణాలపై మరిన్ని వివరాల కోసం పోలీసులు ఆరాతీస్తున్నారు.

శనివారం రాత్రి సుమారు పదిన్నర గంటల సమయంలో డాడెవిల్లేలోని ఈ గ్రీన్ స్ట్రీట్ ప్రాంతంలో ఒక యువకుడి పుట్టినరోజు వేడుకల్లో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇది తల్లపూసా కౌంటీలోని ఒక చిన్న నగరం.

బాధితుల సంఖ్యపై అధికారులు ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు కానీ కనీసం ఆరుగురు టీనేజర్లపై కాల్పులు జరిగినట్టు మృతిచెంది ఉన్నట్టు గుర్తించారు. అందరూ టీనేజర్లు ఉన్నారు.

ఘటనా స్థలంలో మరణించిన వారితో సహా మొత్తం బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని సంఘటన స్థలంలో మరొక సాక్షి చెప్పారు. మృతదేహాలపై తెల్లటి రేకులు కప్పి ఉన్నాయని తెలిపారు.

క్రైమ్ సీన్‌కు భారీ సంఖ్యలో పోలీసులు, సహాయక సిబ్బంది చేరుకొని అసలు ఈ కాల్పులకు కారణాలపై ఆరాతీస్తున్నారు. అనుమానితుడి స్థితి, సామూహిక కాల్పులకు ప్రేరేపించిన కారణాల గురించి పోలీసులు ఆరాతీస్తున్నారు. ఎందుకు కాల్పులు జరిగాయి.? కారణం ఏంటి? కాల్పులకు పాల్పడింది ఎవరు? గల కారణాలు తెలియాల్సి ఉంది.