Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జ్‌లకు స్వైన్ ఫ్లూ .. !
By: Tupaki Desk | 25 Feb 2020 9:26 AM GMTదేశంలో మరో సారి స్వైన్‌ఫ్లూ తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు కావడంతో అందరిలో ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్‌లో స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చేరిన ఓ గర్భిణి చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెల్సిందే. వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను రక్షించారు.
అసలు H1N1 వైరస్ అంటే ఏమిటి?.. ‘హెచ్1ఎన్1 ఫ్లూను… స్వైన్ ఫ్లూ’ అని కూడా అంటారు. స్వైన్ ఫ్లూ అంటే పందులలో వచ్చే శ్వాసకోశ వ్యాధి. ఇది ఒక రకమైన ఇన్పఫ్లూయెన్జా వైరస్ ద్వారా పందులలో వస్తుంది. సాధారణంగా మనుషులకి స్వైన్ ఫ్లూ ఈ రకమైన వైరస్ సోకదు. అంటు వ్యాధుల ద్వారా వస్తుంది. స్వైన్ ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి. కాలానుగుణంగా H1N1 వైరస్ గాలి ద్వారా సంక్రమిస్తుంది. ఈ వైరస్ బాధితులు దగ్గినా లేదా తుమ్మినా, వారు తాకిన వస్తువుల ద్వారా కూడా పరోక్షంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తుల కోసం హాస్పిటల్స్ లో ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేశారు.
తాజాగా, ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. స్వైన్‌ఫ్లూ విషయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సమావేశం లో చర్చించనున్నారు. కోర్టులోని ఆరుగురు న్యాయమూర్తులు, పలువురు లాయర్లు హెచ్1ఎన్1 వైరస్ తో బాధపడుతున్నారని జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడించారు. దీనితో సుప్రీంకోర్టు లో పని చేసే మిగతా వారికి స్వైన్ ఫ్లూ రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఐ బొబ్డేను కోరారు. అలాగే, న్యాయవాదులకు టీకాలు వేసేందుకు వ్యాక్సిన్లను అందుబాటు లో ఉంచాలన్నారు.