Begin typing your search above and press return to search.
ఈటెల తెలివే తెలివి.. వివరణలోనూ కేసీఆర్ కు పంచ్ ఇచ్చారే
By: Tupaki Desk | 1 May 2021 3:14 AM GMTముఖ్యమంత్రి పదవి నాకు గడ్డిపోచతో సమానం.. ఇలాంటి మాటలు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నోటి నుంచి తరచూ వింటుంటాం. పదవుల్ని గడ్డిపోచలుగా చూస్తానని.. ప్రాణాల్ని పణంగా పెట్టి తెలంగాణను తీసుకొచ్చినట్లుగా ఆయన నోటి చెబుతుంటారు.తన గురించి తాను గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. ఆ క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చే మాటలు కాస్త కటువుగా ఉంటాయి. అయితే.. అలాంటి మాటలకు సైతం పంచ్ వేయటం అందరికి సాధ్యమయ్యేది కాదు.
కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు.. ఒకప్పుడు జిగిరీనే కాదు.. తెలంగాణ ఉద్యమ వేళలో.. పార్టీ కోసం భారీగా ఖర్చు చేసిన ఈటెల.. తాజాగా తనను టార్గెట్ చేసిన పార్టీ అధినేత మీద నేరుగా కాకుండా పరోక్షంగా యుద్ధాన్ని షురూ చేశారు. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ సొంత మీడియా సంస్థ అయిన టీ చానల్ లో మాత్రమే ఈటెల మీద పెద్ద ఎత్తున భూకబ్జా ఆరోపణలు చేస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. తనపై పార్టీ అధినేత సొంత చానల్ లో వచ్చిన కథనం మీద వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. ఆ సందర్భంగా కొన్ని మీడియా సంస్థల్లో అని వ్యాఖ్యానించటం గమనార్హం.
తన మీద గురి పెట్టిన కబ్జా ఆరోపణలపై ఈటెల వివరణ ఇచ్చే క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా అధినేత కేసీఆర్ కు భారీ పంచ్ కూడా వేశారు. గులాబీ బాస్ నోటి నుంచి తరచూ వచ్చే.. పదవులు గడ్డిపోచలు లాంటివని చెప్పే ఆయన మాటకు కౌంటర్ ఇస్తూ.. పదవుల్ని గడ్డిపోచలంటూ తాను తక్కువ చేయనని.. అవమానించనని.. కాకుండా ఆత్మాభిమానం ముందు పదవులు ఏవీ పెద్దవి కావని వ్యాఖ్యానించారు.
పదవులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని సీఎం కేసీఆర్ ఇవ్వరన్న విషయాన్ని ఈటెల చెప్పకనే చెప్పినట్లుగా చెప్పాలి. తీవ్రమైన ఎమోషనల్ ప్రెస్ మీట్ లోనూ.. పరోక్షంగా వేసిన ‘గడ్డిపోచ’ పంచ్ కేసీఆర్ మాటకు సరైన కౌంటర్ అన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఇలాంటివి చాలానే ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.