Begin typing your search above and press return to search.
తమిళులను కాల్చేస్తున్న బాణసంచా.. తాజా ఘటనలో ఆరుగురు మృతి
By: Tupaki Desk | 25 Feb 2021 4:12 AM GMTబాణాసంచా అంటే... మనకు ఆనందాన్ని పంచేది. కానీ, తమిళులకు ఇదే ఇప్పుడు ప్రాణసంకటంగా మారిపోయింది. వరుసగా జరుగుతున్న బాణసంచా పేలుడు ఘటనలతో తమిళనాట కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జరిగిన అతిపెద్ద బాణసంచా పేలుడు ఘటనలో ఏకంగా 23మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరిచిపోక ముందే.. తాజాగా జరిగిన పేలుడులో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో రాష్ట్రంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
దీపావళి వచ్చినా.. ఏదైనా సంబరం చేసుకున్నా.. బాణసంచా కాల్చనిదే.. దానికి నిండుదనం రాదు. ఈ బాణసంచాలోనూ తమిళనాడులోని శివకాశిలో తయారు చేసే బాణసంచాకు పేరుంది. ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు సైతం ఎగుమతులు జరుగుతుంటాయని అంటారు. ఇక, తమిళనాడులోని శివకాశిలో ఉన్న జనాభాలో 80 శాతం ప్రజల వృత్తి, ప్రవృత్తి కూడా బాణసంచా తయారీనే. ఇది కుటీర పరిశ్రమ(పేలని పదార్ధాలు) నుంచి భారీ పరిశ్రమల(పేలేవి) ఏర్పాటుకు బ్యాంకులు సైతం రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో శివకాశి ఉత్పత్తులు 5వ స్థానంలో ఉన్నాయి. దీనిని బట్టి.. ఈ పరిశ్రమ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే.. తగిన రక్షణ తీసుకోవడంలోను, ప్రభుత్వం నుంచి భద్రత విషయంలోనూ బాణసంచా కార్మికులకు రక్షణ దొరకడం లేదు. దీంతో చిన్నపాటి ప్రమాదం సంభవించినా పదుల సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా శివకాశిలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తాజా సమాచారం మేరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా దాదాపు 14 మందికి గాయాలయ్యాయి. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని కాళైయ్యర్‌కురిచ్చిలో బాణాసంచా తయారీ పరిశ్రమలో టపాసులు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం భారీ స్థాయిలో ప్రమాదం సంభవించి పది గదులు నేలమట్టమయ్యాయి. పేలుడు ధాటికి ఆరుగురు కూలీలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
సమాచారం అందుకున్న గంటల తర్వాత(కార్మికుల సమాచారం మేరకు) అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు. అయితే.. శరీరాలు బాగా కాలిపోవడంతో మృతులను వెంటనే గుర్తించడం సాధ్యం కాలేదు. వరుసగా పేలుళ్లు చోటుచేసుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాగా శివకాశి పరిసర ప్రాంతాల్లో గత రెండు వారాల్లో మూడు పేలుడు ఘటనలు జరిగాయి. ఈ నెల 12న అచ్చంకుళంలోని ఓ బాణ సంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బాణసంచా పరిశ్రమల క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక అందించాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరి ఏం చెబుతారో చూడాలి. కానీ, నివేదిక ఇచ్చి సరిపెడితే.. కార్మికులకు న్యాయం జరుగుతుందా? చర్యలు చేపడతారా చూడాలి.