Begin typing your search above and press return to search.

అమెరికాలో ఆగని కాల్పులు.. మరో ఆరుగురి మృతి..!

By:  Tupaki Desk   |   18 Feb 2023 12:00 PM GMT
అమెరికాలో ఆగని కాల్పులు.. మరో ఆరుగురి మృతి..!
X
అమెరికాలో కాల్పుల మోత ఏమాత్రం ఆగడం లేదు. యూఎస్ లో విచ్చలవిడిగా పెరిగిన గన్ కల్చర్ కారణంగా యేటా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. గతేడాదిలో అనేక మంది తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి నిత్యం ఏదో ఒక కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ చావు వార్త వినాల్సి వస్తుందోనని అమెరికన్లు వణికిపోతున్నారు.

2023 జనవరి నెల ప్రారంభం నుంచే అమెరికాలో కాల్పుల మోత ప్రారంభమైంది. వరుస ఘటనల్లో ఇప్పటికే అనేక మంది మృత్యువాత పడ్డారు. కాల్పుల్లో వందల మంది గాయాలతో బయటపడ్డ ఘటనలు ఉన్నాయి. ఇటీవల అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక మరో ప్రాంతంలో జరిగిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు.

ముఖానికి మాస్క్ ధరించిన నిందితుడు యూనివర్సిటీ లోకి చొరబడి అక్కడున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన మరువక ముందే మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

దీంతో మిస్సి సీపీలో టేట్ కౌంటీలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఏకంగా ఆరుగురు మృతి చెందడం విషాదంగా మారింది. ఈ ఘటనపై గవర్నర్ టేట్ రీవ్స్ స్పందిస్తూ.. కాల్పుల వెనుక ఉన్నా కారణంగా తెలియాల్సి ఉందన్నారు. అయితే ఈ వరుస ఘటనలో నిందితుడు ఒక్కడే ఉన్నట్లు తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే టెక్సాస్‌ రాష్ట్రంలోని సీలో విస్టా షాపింగ్‌ మాల్‌ల్లోనూ కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈ సంఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. టెక్సాస్ లో కాల్పులకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

కాగా అమెరికా నిత్యం ఏదో ఒక చోట కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. దీనంతటికీ అమెరికాలో పెరిగిపోయిన గన్ కల్చర్ కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా పెరిగిపోతున్న తుపాకీ కల్చర్ కు అమెరికా అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో మరింత మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.