Begin typing your search above and press return to search.

అవును.. 6కిలోల చేప ఆకాశంలో నుంచి ప‌డింది

By:  Tupaki Desk   |   18 May 2016 6:28 AM GMT
అవును.. 6కిలోల చేప ఆకాశంలో నుంచి ప‌డింది
X
భారీ వ‌ర్షాలు కురిసిన‌ప్పుడు చేప‌ల వ‌ర్షం ప‌డ‌టం.. అప్పుడ‌ప్ప‌డు క‌ప్పులు.. సాలీళ్ల వ‌ర్షం ప‌డ‌టం మామూలే. ఇలా ప‌డిన చేప‌లు.. చిన్న చిన్న‌గా ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఒక మోస్తరు సైజులు ఉంటాయి. దీనికి భిన్నంగా ఏకంగా ఆరు కేజీల చేప ఆకాశంలోని అమాంతం కింద‌కు ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగానే ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. ఇలా ప‌డిన చేప ఏ అమెరికాలోనో.. ఆస్ట్రేలియాలోనే అయితే వేరే విష‌యం. మ‌న తెలుగు గ‌డ్డ మీద‌నే ఇలాంటి విచిత్రం చోటు చేసుకుంది.

ప్ర‌కాశం జిల్లా పొదిలి ప‌ట్ట‌ణంలో చోటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్న ఈ వింత ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారిపోయింది. అప్ప‌టివ‌ర‌కూ మండిన ఎండ స్థానంలో పెద్ద ఎత్తున ఈదురు గాలులు మొద‌లై.. కాసేప‌టికి జోరు వాన కురిసింది. ఈ సంద‌ర్భంగా స్థానింగా ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాల‌యం స‌మీపంలో 6 కేజీల భారీ చేప ఒక‌టి ఆకాశం నుంచి ప‌డ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

ఈ కార్యాల‌యానికి ద‌గ్గ‌ర్లో ఉన్న వెంక‌టేశ్వ‌ర్లు అనే పిల్లాడు ఈ చేప‌ను చూశాడు. అప్ప‌టికి అది బ‌తికే ఉండ‌టంతో దాన్ని తొట్టెలో వేసి ఉంచారు. ఈ చిత్రాన్ని చూసేందుకు చాలామంది ఆస‌క్తిక‌న‌ప‌ర్చారు. స‌ముద్రం మీద ఏర్ప‌డే పెద్ద పెద్ద టోర్నిడోల కార‌ణంగా ఇలాంటి చోటు చేసుకుంటుంటాయి. అయితే.. ప‌శ్చిమ దేశాల్లో ఇలాంటివి ఎక్కువ క‌నిపిస్తుంటాయి. అందుకు భిన్నంగా మ‌న ప‌క్క‌నే ఉన్న ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఉదంతం చోటు చేసుకోవ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. చేప‌లు ప‌డ‌టం మామూలే అయినా.. ఆరు కేజీల భారీ చేప ప‌డ‌టం కాస్త అరుదైన అంశంగా చెప్పాలి.