Begin typing your search above and press return to search.
టాప్ లెస్ ఫొటోల కేసు..జర్నలిస్టులపై విచారణ!
By: Tupaki Desk | 26 Oct 2016 10:12 AM GMTబ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ టాప్ లెస్ ఫోటోల వ్యవహారంపై కోర్టు విచారణను వేగవంతం చేసింది. రహస్యంగా ఫోటోలు తీయడం - అనంతరం వాటిని పత్రిక మొదటిపేజీలో ప్రచురించడం, ఫలితంగా బ్రిటన్ రాజకుంటుంబం పరువు తీయడం వంటి అంశాలను పేర్కొంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కేట్ తరుపు న్యాయవాదుల వాదనకు మొగ్గు చూపింది కోర్టు. దీంతో కేట్ ఫొటోలను ప్రచురించిన క్లోజర్ మ్యాగజీన్ కు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై విచారణకు రంగం సిద్ధమైంది. ఈ విషయంపై వచ్చే ఏడాది జనవరి నుంచి విచారణ జరగనున్నట్లు ఫ్రెంచ్ న్యాయ శాఖ వర్గాలు తెలిపాయి.
కాగా, కేట్ మిడిల్టన్, ఆమె భర్త ప్రిన్స్ విలియమ్స్ తో కలిసి ఫ్రాన్స్ లోని లా ఫ్రావిన్స్ కు హాలిడే కోసం వెళ్లింది. అక్కడ మూడో మనిషి అడుగుపెట్టే అవకాశంలేని భవంతి పోర్టికోలో కేట్, విలియంలు చనువుగా ఉన్న సమయంలో క్లోజర్ మ్యాగజీన్ కు చెందిన జర్నలిస్టులు రహస్యంగా ఫొటోలు తీసి... మరుసటి రోజే భారీ హెడ్డింగ్ లతో కేట్ టాప్ లెస్ ఫొటోలు కవర్ పేజీగా ముద్రించి మ్యాగజీన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. దీంతో ఈ వ్యవహారంపై బ్రిటన్ రాజకుటుంబం భగ్గునమండింది. ఫ్రెంచ్ ఉన్నతాధికారులతో మాట్లాడి సదరు పత్రికపై దావా వేసింది. అయితే తాజాగా నాలుగేళ్ల విచారణలో ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుగా తేలారు. ఈ సంఘటన 2012 లో జరిగింది!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/