Begin typing your search above and press return to search.

ఒకరోజు సీఎం కావాలంటున్న ఆ ఆరుగురు

By:  Tupaki Desk   |   16 Dec 2015 4:26 AM GMT
ఒకరోజు సీఎం కావాలంటున్న ఆ ఆరుగురు
X
నూరేళ్లు జీవించాల్సిన చిన్నారుల ప్రాణాలు తీసే ప్రాణాంతక వ్యాధులెన్నో. ఇలాంటి వారికి ఎన్నో కోర్కెలు.. మరెన్నో ఆశలు ఉంటాయి.కానీ.. వాటిని తీర్చుకునే అవకాశం కాలం వారికి ఇవ్వదు. ఇలాంటి వారి ఆశల్ని.. ఆశయాల్ని.. కోర్కెల్ని తీర్చేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు పని చేస్తుంటాయి. ఇందుకోసం చాలానే శ్రమ తీసుకుంటాయి. ఇలాంటి చిన్నారుల కోర్కెలు తీర్చేందుకు వీలుగా.. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు మొదలు.. సెలబ్రిటీలు వరకూ తమ వంతు ప్రయత్నం తాము చేస్తుంటారు.

అప్పట్లో తీవ్ర అస్వస్థతకు గురై.. టీఆర్ ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించే చిన్నారిని ఆయన స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పలుకరించటం.. కాసేపు ఆ పిల్లాడితో గడపటం మర్చిపోలేం. ఇదే జాబితాలో పవన్ కల్యాణ్ మొదలుకొని ఎంతోమంది ప్రముఖులు తమ సమయాన్ని వెచ్చిస్తుంటారు. ప్రాణాంతక వ్యాధులతో పోరాడే చిన్నారుల కోర్కెల్ని తీర్చేందుకు పోలీసుల అధికారులుగా ఒకరోజు అవకాశం కల్పించటం లాంటివి మానవత్వంతో చేస్తుంటారు.

తాజాగా తలసేమియాతో పోరాడుతున్న సూర్యాపేటకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు మడిపల్లి రూప్ అరోనా కు నగర పోలీసు కమిషనర్ కావాలన్నది కోరిక. ఇందుకు ప్రయత్నిద్దామంటే అట్టే ‘సమయం’ లేదు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపితే.. అతడి కోర్కెను తీర్చేందుకు ఒక రోజు కొత్వాల్ గా అతన్ని అపాయింట్ మెంట్ ఇచ్చి.. కాసేపు విధులు నిర్వహించేలా చేశారు. ఈ కార్యక్రమం ఎంతోమందిని కదిలేంచేలా చేసింది. అయితే.. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న ఆరుగురు పిల్లలకు.. ఒక రోజు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని.. వారి కోర్కెల్ని తీర్చటానికి తమకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ కావాలని మేకే విష్ సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. మిగిలిన వాటి సంగతి ఫర్లేదు.. ఏకంగా సీఎం పదవిని ఒకరోజు నిర్వర్తించాలని చిన్నారులు కోరుకుంటున్నారు. మరి.. చిన్నారుల కోరికను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుస్తారా? గతంలో మాదిరే ఈ విషయం మీదా స్పందిస్తారా..?