Begin typing your search above and press return to search.

ఆపరేషన్‌ గరుడ-2 మొదలైంది: హీరో శివాజి

By:  Tupaki Desk   |   2 Jan 2019 6:23 PM IST
ఆపరేషన్‌ గరుడ-2 మొదలైంది: హీరో శివాజి
X
ఆపరేషన్‌ గరుడ 2 మొదలైందా.? చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు మొదలయ్యాయా.? అంటే ఔననే అంటున్నారు హీరో శివాజీ. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరో కుట్రకు త్వరలో తెరలేవబోతోందంటూ విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది అధికారులు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. ప్రతిపక్ష పార్టీపై అంత ఆసక్తి ఉంటే.. ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీలో చేరాలని శివాజీ సూచించారు.

చుక్కల భూముల రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పడం ద్వారా ఇప్పుడు మరో కుట్రకు పథక రచన జరుగుతోందని శివాజీ ఆరోపించారు. చుక్కల చెరువు భూముల పేరుతో ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని అన్నారు. త్వరలో అన్ని ఆధారాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందిస్తానని.. సంక్రాంతిలోపు చుక్కల భూముల సమస్యకు పరిష్కారం లభించకపోతే.. అధికారుల తీరుకి నిరసనగా ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు శివాజీ. మొత్తానికి కొత్త ఏడాదిలో ఆపరేషన్‌ గరుడ 2 అంటూ.. సంచలనానికి తెర తీశారు హీరో శివాజీ.