Begin typing your search above and press return to search.

పెళ్లి ప్రకటన.. పాక్ అమ్మాయి అయినా పర్లేదంట!

By:  Tupaki Desk   |   9 Nov 2016 1:30 AM GMT
పెళ్లి ప్రకటన.. పాక్ అమ్మాయి అయినా పర్లేదంట!
X
ఈమధ్య కాలంలో కొంచెం కొంచెం కులాంతర - మతాంతర వివాహాలు జరుగుతున్నాయని - నేటి జనరేషన్ మారిందని చెన్ని చెప్పుకున్నా... కులం - మతం విషయంలో మాత్రం ఆ మార్పు అంతగా కనిపించదు!! ఈ క్రమంలో పెళ్లి చూపులకు సంబందించి మిగిలిన అన్ని అంశాలకంటే కులం - మతం ఇంకా చాలా చోట్ల ప్రధానంగా ఉంది. ఇది బహిరంగంగా మాట్లాడుకునే విషయంగా మారిపోవడంతో న్యూస్ పేపర్లు - మ్యాట్రిమొనియల్ వెబ్‌ సైట్స్‌ మొదలైన వాటిలో లో వధువు - వరుడు కావాలంటూ వెల్లువెత్తే ప్రకటనల్లో ముఖ్యంగా మతాన్ని ప్రస్తావిస్తూ - కులాన్ని హైలైట్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామనుకున్న 29 ఏళ్ల కుర్రాడు తన మతం ప్రకటనల్లో కనిపించకపోయే సరికి ఆందోళన చెందాడు.

అదేంటి... కుల మతాల వారీగా పత్రికల్లోనూ - వెబ్ సైట్స్ లోనూ ప్రకటనలు చాలానే చూస్తుంటాం కదా అని తొందరపడకండి. తన మతం ప్రకటించడం లేదని చెబుతున్న ఈ యువకుడు స్వతహాగా హేతువాది. వెటకారమా... హేతువాదులు ఏ మతాన్ని పాటించరు కదా! అని మరళా తొందరపడకండి! కొందరు హేతవాదులు ఉన్న మతాలను పాటించరు కానీ.. లేని మతాన్ని మాత్రం సృష్టించుకున్నారు. ఈ క్రమంలో 2008 నుంచి కేరళలో హేతువాదులు తమకో మతాన్ని సృష్టించుకున్నారు. ఆ మతం పేరు డిన్‌ కోయిజమ్! వాళ్లకు ఒక దేవుడు కూడా ఉన్నాడు.. అదే సూపర్‌ మ్యాన్ వేషంలో ఉన్న ఎలుక!

దీంతో ఈ మతాన్ని పాటించే రస్మిన్ శివశంకర్ అనే ఈ యువకుడి స్వస్థలం కేరళలోని పరవూర్. తాను నమ్మిన మతం పేరుతో వధువు కావాలని ఓ మలయాళం దినపత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన వారంతా ఆశ్చర్యపోయారే తప్ప ఎవరూ స్పందించలేదు. ఇంత పెద్ద దేశంలో - ఇన్ని మ్యాట్రిమొనియల్ సైట్స్‌ లో తను నమ్మిన మతం లేదా అంటూ శివశంకర్ ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుతం పెళ్లి కావడంలేదనే ప్రస్ట్రేషన్ లో ఉన్నాడో ఏమో కానీ... తన మతానికి చెందిన అమ్మాయిని చూడమని కోరడంతో పాటు... ఆఖరికి పాకిస్థాన్ అమ్మాయి అయినా అభ్యంతరం లేదని చెబుతున్నాడు. ఈ వింత ప్రకటన ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్‌ గా మారింది. కాగా మనోడు పూజించే ఎలుక బాలమంగళం అనే చిల్ట్రన్స్ మ్యాగజైన్‌ లోని ఫిక్షనల్ క్యారెక్టర్‌ లో ఉన్న ఎలుక మాదిరిగా కనిపిస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/