Begin typing your search above and press return to search.
చేతులెత్తేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే!
By: Tupaki Desk | 23 Feb 2022 10:30 AM GMTఅయితే.. కష్టమేనని వారు లబోదిబోమంటున్నారు.
ముఖ్యంగా ప్రజాప్రతినిధి అంటే.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. పార్టీ ఇచ్చే మేనిఫెస్టోతో పాటు.. స్థానికంగా ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేలు కొన్ని హామీలు ఇస్తుంటారు. వాటిని చూసే ప్రజలు వారికి ఓట్లు వేసి గెలిపిస్తారు. ఎమ్మెల్యే అయిన తర్వాత.. ఆయా సమస్యలపై దృష్టి పెడతారని అనుకుంటారు.
కానీ, వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు మాత్రం జీరోలు అయిపోయారనే వాదన వినిపిస్తోంది. కనీసం.. ప్రజల్లోకి వచ్చేందుకు కూడా వారు జంకుతున్నారు. ఎందుకంటే.. నియోజకవర్గం అభివృద్ధి నిధులు కనుక వారికి ఇచ్చి ఉంటే.. ఎంతో కొంత నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి.. పట్టు పెంచుకునే పరిస్థితి.. ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండేది. కానీ, ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు.
కేవలం సంక్షేమ పథకాలకు.. అది కూడా నేరుగా ఇస్తోంది. దీంతో ప్రజలకు, స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య బంధం దాదాపు తెగిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఏదీ తమకు తెలియడం లేదని.. కనీసం.. తమ చేతుల మీద ఏ కార్యక్రమం చేయలేక పోతున్నామని.. వారు చెబుతున్నారు.
గ్రామాల్లో పరిస్థితి ఇదీ..
గ్రామీణ ప్రాంతంలో ఎమ్మెల్యేలు అసలు తిరిగే పరిస్థితి లేకుండా.. పోయింది. నిజానికి గ్రామాల్లోనే వైసీపీ ఎక్కువ ఓటు బ్యాంకు సంపాయించుకుంది. వైఎస్ పై ఉన్న సానుభూతితో.. గ్రామీణ స్థాయిలో వైసీపీకి ప్రజలు పట్టంగట్టారు. ఈ క్రమంలో ఇక్కడి సమస్యలు పరిష్కారం అవుతాయని.. పాత ప్రాజెక్టులతోపాటు.. సాగునీటి సమస్యలు తీరుతాయని భావించారు.
కానీ, ఎమ్మెల్యేలు.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయా సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడ అడుగు పెట్టినా.. గ్రామాల్లో తమను నిలదీస్తారని.. ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.
కనీసం ప్రాధాన్యం..
ఎమ్మెల్యేగా కనీసం ప్రాధాన్యం లేకుండా పోయిందని.. వైసీపీ ప్రజాప్రతినిదులు భావిస్తున్నారు. నిజానికి క్షేత్రస్థాయిలో సెంటిమెంటుతో కూడుకున్న సంక్షేమ పథకం.. పింఛన్ల పంపిణీ. కొత్తవారిని ఎంపిక చేయడంతోపాటు.. పెంచిన ఫించన్లను నేరుగా అందించే కార్యక్రమాలు చేస్తే.. ఎమ్మెల్యేలకు అంతో ఇంతో సానుభూతి, గుర్తింపు ఉంటుంది.
అయితే.. ప్రభుత్వం మాత్రం దీనిలోనూ ఏదో అవినీతి జరిగిపోతుందని ప్రకటిస్తూ..నేరుగా వలంటీర్లతోనే ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. వాస్తవానికి ఇందులో అవినీతికి ఆస్కారం లేదు. కానీ, ఎమ్మెల్యేలను మాత్రం జోక్యం చేసుకోనీయకుండా.. గుండుగుత్తుగా మొత్తం సింపతీ తనకే దక్కాలనే విధంగా సర్కారు వ్యవహరిస్తుండడం ఎమ్మెల్యేలకు గుదిబండగా మారింది.
క్షేత్రస్థాయిలో పనులు
ఇక, క్షేత్రస్థాయిలో చిన్న చిన్న పనులైనా.. ఎమ్మెల్యేలు దక్కించుకోలేక పోతున్నారు. పైగా.. గతంలో చేసిన వారు కూడా ఇప్పుడు తప్పుకొంటున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదు. దీంతో ఇప్పటికే చాలా మంది కాంట్రాక్టర్లు హైకోర్టు కు వెళ్లి ఫైట్ చేసి.. తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యేలకు పనులు లేక పోగా.. చేద్దామన్నా.. బిల్లులు వస్తాయో రావో.. పెట్టుబడులు పెట్టి ఎదురు చూడాలేమో.. అనే సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు.
కేడర్ పరిస్థితి ఇదీ..
ఇక, 2019లో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేసిన కేడర్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వారిని పట్టించుకునే నాధుడు కూడా లేదు. గతంలో చంద్రబాబు హయాంలో కనీసం.. జన్మభూమి కమిటీలని.. లేదా.. మరేదో పేరు పెట్టి కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ అది కూడా లేదు. కేడర్‌ను వాడుకుని వదిలేయడం అనే సూత్రాన్ని అమలు చేస్తోందనే భావన వ్యక్తం అవుతోంది.
ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చిన కేడర్ ఇప్పుడు.. రెండున్నరేళ్ల పాలనలో ఒక్కరోజు కూడా గుర్తుకు రాకపోవడం.. కనీసం.. వారి కుటుంబాలకు.. లేదా వారికి వలంటీర్లో.. లేదా.. లబ్ధిదారులైన వారికి పథకాలో కూడా అందించడం లేదని వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని.. తూర్పు, విశాఖ, కర్నూలు, నెల్లూరు వంటి జిల్లాల్లో బాహాటంగానే చెబుతున్నారు.
రాజన్న రాజ్యంలో రైతుల గోడు!
రాజన్న రాజ్యం తెస్తానని చెప్పిన వైసీపీ.. రాజన్న రాజ్యంలో కీలకమైన రైతులను మాత్రం పక్కన పెట్టిందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఆర్బీకేలు ఏర్పాటు చేసినా.. ధాన్యం కొనుగోలు జరగదు. సరైన మద్దతు ధర దక్కదు. అదేమని ప్రశ్నిస్తే.. గుంటూరు జిల్లా వినుకొండలో రైతు నరేంద్రను జైలు పాలు చేశారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు.
ఇక, ఇటీవల మిర్చి పంట మొత్తం వైరస్‌తో దెబ్బతింది. దీనిపై రైతులు ఆర్బీకేల్లో ఫిర్యాదులు చేశారు. అయినా.. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి మద్దతు లభించలేదు. మరోవైపు.. రైతులు వినియోగించే ఉచిత విద్యుత్‌కు మీటర్లు పెట్టాల్సిందే.. అని హుకుం జారీ చేశారు. దీంతో ఇదేనా రాజన్న రాజ్యం అంటూ.. రైతులు మరోవైపు.. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.