Begin typing your search above and press return to search.

చ‌ల్ల‌కు వ‌చ్చి ముంత దాచిన‌ట్టు ఉంది.. వైసీపీ ఎమ్మెల్యేల‌ ప‌రిస్థితి!

By:  Tupaki Desk   |   22 Feb 2022 2:30 AM GMT
చ‌ల్ల‌కు వ‌చ్చి ముంత దాచిన‌ట్టు ఉంది.. వైసీపీ ఎమ్మెల్యేల‌ ప‌రిస్థితి!
X
చ‌ల్ల‌కు వ‌చ్చి ముంత దాచిన‌ట్టుగా ఉంది వైసీపీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి. క్షేత్ర‌స్థాయిలో పార్టీ ప‌రిస్థితి..త‌మ ప‌రిస్థితి ఏమీ బాగోలేదు. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌ట్ట మట్టి తీయ‌డం లేదు.. అడుగంత గుంత కూడా త‌వ్వ‌డం లేదు. ఎక్క‌డా మ‌చ్చుకైనా అభివృద్ధి జ‌ర‌గ‌డం లేదు.

దీంతో ఎమ్మెల్యేలు అంద‌రూ కూడా అధిష్టా నంపై గుర్రుగా ఉన్నారు. ఈ విష‌యం.. ప్ర‌తినియోజ‌క‌వ‌ర్గంలోనూ..వాళ్ల మ‌నుషులే చ‌ర్చించుకుంటున్నా రు. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిర‌గాలంటే.. రేపు ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతారు? అన‌ని వారు గుస‌గుస‌లాడుతున్నారు.

ఒక్క రోడ్డు వేయించ‌లేక పోతున్నారు. ఒక్క అభివృద్ధి కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్ట‌లేక పోతున్నారు. మ‌రోవైపు.. సొంత పార్టీ కేడ‌ర్‌ను కూడా ప‌ట్టించుకునే ప‌రిస్థితి.. వారికి కూడా అంతో ఇంతో మేలు చేసే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది.

ఇదే విధానం కొన‌సాగితే.. ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీకి మేలు చేసిన‌ట్టు అవుతుంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. కార్య‌క‌ర్త‌లు కూడా.. టీడీపీలోకి జంప్ చేసే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు. ఇదే విష‌యంపై వైసీపీ ఎమ్మెల్యేలు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నారు.

ఈ క్ర‌మంలోనే వారు అధిష్టానంపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హంతో ఉన్నారు. కానీ, బ‌య‌ట‌కు చెప్పలేక పోతు న్నారు. అలాగ‌ని మ‌నసులో దాచులోక పోతున్నారు. జిల్లాల విభ‌జ‌న ను అడ్డు పెట్టుకుని.. వ్య‌తిరేక‌త వెలిబుచ్చుతూ.. ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డికానీ, మ‌హీధ‌ర్ రెడ్డి కానీ, మేడా మ‌ల్లికార్జున రెడ్డికానీ, ప‌శ్యిమ ప్ర‌కాశం జిల్లా నాయ‌కులు కానీ.. ఇలా చెప్పుకొంటూ పోతే.. జాబితా చాలానే ఉంది. వీరంతా జిల్లాల పేరుతో మండిప‌డుతున్నారు. కానీ.. అస‌లు విష‌యం అది కాదు.

అస‌లు విష‌యం మాత్రం అభివృద్ధి, నిధులు, పార్టీలో త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌నే ఆవేద‌న క‌నిపిస్తోంది. ప‌రిస్థితి ఇలానే ఉంటే.. నాయ‌కుల‌కు ప్ర‌జల ద‌గ్గ‌ర ఎలాంటి గౌరవం ఉంటుంది? అని పెద్ద ఎత్తున నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

మ‌రి ఇప్ప‌టికైనా అధిష్టానం కానీ.. ప్ర‌భుత్వ పెద్ద కానీ.. ఎమ్మెల్యేల గోడు వింటారా? లేదా? అనేది ఆస‌క్తిగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాలం టే.. ఖ‌చ్చితంగా.. ఎమ్మెల్యేల‌ను సంతృప్తిప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌రిశీల‌కులు కూడా భావిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.