Begin typing your search above and press return to search.

దిమ్మె వేస్తాము..బిల్లులు మాకు తెలియ‌వు.. వైసీపీ ఎమ్మెల్యేలు!?

By:  Tupaki Desk   |   17 Feb 2022 2:30 PM GMT
దిమ్మె వేస్తాము..బిల్లులు మాకు తెలియ‌వు.. వైసీపీ ఎమ్మెల్యేలు!?
X
అదేంటి? అని నోరు వెళ్ల‌బెడుతున్నారా? అంతే.. ఏపీలో అంతే! ఇప్పుడు అక్క‌డి ప‌రిస్ధితి డోలాయ‌మానంగా ఉంది. ఎమ్మెల్యేల ప‌రిస్తితి మ‌రింత దారుణంగా ఉంది. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం.. వ‌ద‌ల మంటే పాముకు కోపం.. అన్న‌ట్టుగా మారిపోయింది ఎమ్మెల్యేలు, ఎంపీల ప‌రిస్థితి.

అటు ప్ర‌బుత్వం నుంచి వీరికి ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో ఏ కార్య‌క్ర‌మానికి కూడా వీరికి ప్రాధాన్యం ల‌భించ‌డం లేదు. ఇక‌, ప్ర‌జ‌ల నుంచి వీరికి తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది. దీంతో అధికార పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు.. మ‌ల్లగుల్లాలు ప‌డుతున్నారు.

ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, వివిధ ర‌కాల ప‌నులు కూడా నేరుగా ప్ర‌భుత్వం నుంచి, సీఎం నుంచి ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోతున్నాయి. దీంతో ఇంక‌,ఎమ్మెల్యేల‌కు ఎంపీల‌కు ప‌నులు ఏముంటాయి. దీంతో ప‌ట్ట‌ణాల సంగ‌తి ఎలా ఉన్నా.. గ్రామాల్లో తిరిగే ప‌రిస్థితి అస్స‌లు క‌నిపించ‌డం లేదు.

ఇదే విష‌యం ముఖ్య‌మంత్రి కార్యాల‌యం వ‌ర‌కు కూడా చేరిపోయింది. ప్ర‌బుత్వ‌మే నేరుగా త‌మ‌కు ప‌నులు చేస్తుంటే.. సంక్షేమంఅమ‌లు చేస్తుంటే.. మ‌ధ్య‌లో మీరు ఎవ‌రు? అనే మాట ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తోంది. మ‌రోవైపు.. ఎంపీలు కూడా అంతే!

అయితే.. ఈ గోడుకు ఎవ‌రో చ‌క్క‌ని ప‌రిష్కారం చూపించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. కొన్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల పేరిట‌.. హ‌డావుడి చేయాలి..దిమ్మెలు వేసి.. ఓపెనింగ్స్ అంటూ కొంత హ‌డావుడి చేయాల‌ని.. అదేచాలు.. అన్న‌ట్టుగా ఉంది వ్య‌వ‌హారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గ‌త వారం నుంచి ప‌దుల సంఖ్యలోదిమ్మెలు వేస్తున్నారు.

శిలాఫ‌ల‌కాలు.. క‌డుతున్నారు. ఓపెనింగ్ బోర్డులు కూడా క‌డుతున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప‌నుల‌కు బిల్లులు రాలేదు.. కొత్త ప‌నుల‌కు..వ‌స్తాయా? అని గ్రామాల్లో పెద‌వి విరుస్తున్నారు. నిజానికి గ‌త ప్ర‌భుత్వంలో చేసిన ప‌నుల‌కు.. ఇప్ప‌టికీ .. చాలా మంది బిల్లులు చెల్లించాల్సి ఉంది.

మ‌రోవైపు.. స‌చివాల‌యాలు, ఆర్బీకే, స్కూలు భ‌వ‌నాలు.. కాంపౌండ్ వాల్స్‌.. పార్కుల సుంద‌రీక‌ర‌ణ‌, క‌మ్యూనిటీ భ‌వ‌నాల నిర్మాణం.. ఇలా.. ఎన్నో చేస్తే.. ఇంత వ‌ర‌కు.. దాదాపు 70 న‌నుంచి 80 శాతం వ‌ర‌కు.. బిల్లు రాలేదు.. అని.. ఈ మ‌ధ్య కాంట్రాక్ట‌ర్లు ధ‌ర్నా కూడా చేశారు. మ‌ళ్లీ.. ఇప్పుడు.. ఆ అనుభ‌వంతో.. ఎమ్మెల్యేలు వేసే దిమ్మెలు అలానే ఉంటాయో.. ఆచ‌ర‌ణ‌లోకి వ‌స్తాయో.. అని.. గ్రామాల్లో ఇదే టాప‌పిక్‌పెద్ద ఎత్తున చ‌ర్చ‌గా మారింది.


అంటే.. దిమ్మెలు క‌ట్టినా.. బోర్డులు పెట్టినా.. ప్ర‌యోజనం లేద‌ని.. ఇదంతా రాజ‌కీయ హంబ‌క్కేన‌ని.. పైగా.. త‌మ‌కు చేతి చ‌మురు వ‌దులుతుంద‌ని.. కాంట్రాక్ట‌ర్లు సైతం భావించే ప‌రిస్థితి ఇప్పుడు ఏపీలో ఏర్ప‌డిపోయింది.

రేపు ప్ర‌జా ప్ర‌తినిదుల ప‌రిస్థితి కూడా అంతేన‌న‌ని..ఇ ప్పుడు ప‌నులు చేయించుకుని రేపు.. డ‌బ్బుల‌కు మాత్రం మొండి చేయి చూపుతార‌ని.. అంటున్నారు. ప్ర‌స్తుతం ఇది చాలా హాట్ టాపిక్‌గా మారింద‌నే చెప్పాలి.