Begin typing your search above and press return to search.
కరోనా సోకిన వారిని కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారే!
By: Tupaki Desk | 15 Jun 2022 3:30 AM GMTకరోనా సోకిన వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే.. దీనికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. కరోనా సోకిన వారిని క్వారంటైన్ చేయడం.. వారికి అవసరమైన మందులు.. నీరు.. ఆహారం అందించడం.. వారు త్వరగా కోలుకునేలా ధైర్యం చెప్పడం.. వారి ఆరోగ్యంపై నిత్యం పర్యవేక్షణ ఉంచడం.. వంటివి కామన్. కానీ, చైనా లో మాత్రం ఇటీవల కరోనా సోకిన వారిని కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారని.. ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఇది మానవహక్కులను హరించడమేనని ఐక్యరాజ్యసమితిలోని మానవహక్కుల విభాగం కూడా మండిపడుతోంది. ఇంతకీ.. అసలు చైనాలో ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది.
"జీరో కొవిడ్" విధానమంటూ కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్న చైనా.. 50 రోజుల తర్వాత కరోనా సోకిన వ్యక్తులను బయటకు విడిచిపెట్టింది. కరోనా జైళ్లుగా అభివర్ణిస్తున్న ఈ క్వారంటైన్‌లో.. కొవిడ్ పాజిటివ్ సోకిన వారిని బలవంతంగా బంధించిన డ్రాగన్.. ఇన్ని రోజులకు వారిని బాహ్య ప్రపంచంలోకి వెళ్లేందుకు అనుమతినిచ్చింది. అయితే వీరు మనుషులను కలవకుండా.. మధ్యలో కంచె(బోనుల వంటివి)ను ఏర్పాటు చేసింది. ఆ కంచెల మధ్య నుంచే బంధువులను చూస్తున్నారు.
కరోనా పుట్టినిల్లు చైనాలో కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతూనే ఉన్నాయి. ఉత్తర కొరియాతో సరిహద్దు నగరమైన దండాంగ్‌లో 50 రోజుల తర్వాత కరోనా బాధితులను చైనా బాహ్య ప్రపంచంలోకి విడిచిపెట్టింది. కరోనా పాజిటివ్‌గా తేలిన వీరిని కఠినమైన నిబంధనలుండే క్వారంటైన్‌లో డ్రాగన్ నిర్బంధించింది. 50 రోజుల తర్వాత వీరిని ఆంక్షలు విధిస్తూ బయటకు అనుమతించింది. ఇనుప కంచెలు ఏర్పాటు చేసి వాటి మధ్యన బంధువులు, కుటుంబ సభ్యులను కలిసేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దండాంగ్ నగరంలో ఆహారం సహా రవాణపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి.
గత రెండు వారాల్లో పాజిటివ్ కేసులు లేని ప్రాంతాల వారిని మాత్రమే బయటకు వదిలారు. దండాంగ్‌లో ప్రతి సోమవారం మాత్రమే ప్రజలు నిత్యావసరాలు కొనుగోలుకు చైనా ప్రభుత్వం అనుమతినిస్తోంది. లాక్‌డౌన్ సడలింపు ప్రకటన వెలువడగానే చాలా మంది ప్రజలు కంచెల వద్దకు వచ్చి తమవారి కోసం ఎదురుచూశారు. ప్రజలను ఇబ్బంది పెట్టక తప్పని పరిస్థితి నెలకొందని దండాంగ్ మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర వసతుల మధ్య క్వారంటైన్‌లో ఉంచినందుకు క్షమాపణలు చెప్పారు.
అయితే.. ఈ పరిస్థితికి సంబంధించి కొన్ని ఫొటోలు తాజాగా మీడియాకు విడుదలయ్యాయి. ఇవి ప్రపంచ దేశాల్లోనూ వైరల్ అయ్యాయి. వీటిని చూసిన నెటిజన్లు.. ఇంత దారుణమా.?? అని బుగ్గలు నొక్కుకున్నారు. మరోవైపు.. అమెరికా సహా.. పలు ప్రపంచ దేశాలు.. చైనా అనుసరిస్తున్న కంచెల విధానంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది అత్యంత అమాన వీయమని వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు.. ప్రపంచ మానవ హక్కుల వేదికలు కూడా చైనాను తప్పుపడుతున్నాయి. ఇది మానవ హక్కులను హరించడమేనని అంటున్నాయి. అయినప్పటికీ.. చైనా ఎవరినీ లెక్కచేయక పోవడం గమనార్హం.