Begin typing your search above and press return to search.
పెండింగ్ బిల్లులకు భయపడి 2 నెలల ముందే ఆ సైట్ మూసేశారా?
By: Tupaki Desk | 14 Feb 2023 10:30 AM GMTతీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం.. పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి నెల తిరిగేసరికి.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు.. పింఛన్లు ఇవ్వటం కోసం అపసోపాలు పడాల్సిన పరిస్థితి. నెల మొదటి రోజున జీతాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం.. పది రోజులు అయిన తర్వాత మాత్రమే జీతాలు ఇస్తున్న పరిస్థితి. ఇక.. ఫించన్ల చెల్లింపు మరింత ఆలస్యం అవుతున్న పరిస్థితి.
అయినప్పటికీ నిధుల అడ్జెస్ట్ మెంట్ ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు ఏడాది చివర్లో బిల్లుల చెల్లింపు ఒత్తిడి అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీన్ని ఎదుర్కోవటానికి వీలుగా సరికొత్త ప్లాన్ వేసినట్లుగా చెబుతున్నారు.
ఇందులో భాగంగా ప్రభుత్వ పనులు పూర్తి చేసిన తర్వాత చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి సీఎఫ్ఎంఎస్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం చివర్లో వారం నుంచి పది రోజుల పాటు ఈ సైట్ ను మూసేస్తారు.
అందుకు భిన్నంగా జగన్ సర్కారు మాత్రం ఫిబ్రవరి మొదటి నుంచి మూసేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం పెండింగ్ బిల్లుల చెల్లింపులు భారీగా ఉండటమేనని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం చూస్తే.. పెండింగ్ బిల్లులు దాదాపు రూ.45 వేల కోట్లు ఉన్నాయని.. వీటికి సంబంధించిన బిల్లులు వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తే.. వాటి భారం ఎక్కువగా కనిపించే వీలుంది. అందుకే.. రెండునెలల ముందే ఈ బిల్లుల్ని అప్ లోడ్ చేసే వీల్లేకుండా నిలిపివేసినట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే ఉన్న పెండింగ్ బిల్లుల మొత్తం రూ.45వేలు కాగా.. రానున్న రెండు నెలల్లో మరో రూ.30 వేల కోట్ల వరకు ఉండే వీలుంది. అంటే.. పెండింగ్ బిల్లుల విలువే ఏకంగా రూ.70వేల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇంత భారీ మొత్తాన్ని ఎలా తీరుస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇలా మూసేయటం వల్ల వచ్చే లాభం ఏమిటంటే.. ప్రభుత్వ బకాయిల్ని ఆర్థిక సంవత్సరం చివర్లోరూపొందించే నివేదికల్లో ప్రస్తావించే వీలు ఉండదు. అంటే.. ఇప్పుడు చూపిస్తున్న రూ.45 వేల కోట్లు మాత్రమే కానీ.. ఈ రెండు నెలల్లో అప్ లోడ్ చేసే అవకాశం ఉన్న రూ.30వేల కోట్ల బిల్లులు అప్ లోడ్ కావు. దీంతో.. పెండింగ్ బిల్లులు రికార్డుల్లో తక్కువగా చూపించే వీలుంది. ఈ కారణంతోనే రెండు నెలల ముందే వెబ్ సైట్ ను మూసేసినట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరెన్ని సిత్రాలు చూడాల్సి వస్తుందో అన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.