Begin typing your search above and press return to search.

మోదీ ఈవెంట్ మేనేజ‌ర్‌ గానే బెస్ట్ అట‌!

By:  Tupaki Desk   |   28 Sep 2017 11:30 PM GMT
మోదీ ఈవెంట్ మేనేజ‌ర్‌ గానే బెస్ట్ అట‌!
X
ప్ర‌పంచ దేశాల‌తో `శ‌భాష్‌` అని అనిపించుకుని, దేశంలోని రెండో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీని అన్నీ తానై న‌డిపిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. ఈవెంట్ మేనేజ‌ర్ క‌న్నా ఘోర‌మా? ఆయ‌న పాల‌న అంత‌లా భ్ర‌ష్టు ప‌ట్టిందా? దేశంలో సామాన్యుల స‌ర్కార్ అంటూనే అసామాన్యుల ప్ర‌భుత్వం న‌డుస్తోందా? మోదీ పాల‌న అంతా మేడిపండును త‌ల‌పిస్తోందా? మోదీ ప‌థ‌కాల్లో అత్యంత కీల‌క‌మ‌ని చెబుతున్న‌వి అత్యంత దుర‌దృష్ట క‌ర రీతిలో విఫ‌ల‌మ‌య్యాయా? అంటే.. నిన్న బీజేపీ పార్టీకే చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ ఆర్థిక మంత్రి య‌శ్వంత్ సిన్హా - ఈరోజు సీపీఎం జాతీయ కార్య‌ద‌ర్శి - మేధావి సీతారాం ఏచూరిలు ఔన‌నే చెబుతున్నారు.

నిన్న య‌శ్వంత్.. మోదీని ఏకేస్తూ.. పెద్ద వ్యాసం కుమ్మ‌రించ‌గా అది దేశం మొత్తం సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు సీతారాం ఏచూరి విజ‌య‌వాడ‌లో జ‌ర‌గిన కార్య‌క్ర‌మం అనంత‌రం గురువారం మీడియాతో మాట్టాడుతూ.. మోదీని దూది క‌న్నా ఘోరంగా ఏకేశారు. నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నం నిలువెల్లా బ‌య‌ట ప‌డుతుంద‌ని చెప్పిన ప్ర‌ధాని పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని - దీనివ‌ల్ల దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. నాలుగు అంశాల కోసం నోట్ల రద్దు చేశామని మోదీ అప్ప‌ట్లో చెప్పార‌ని, అయితే, ఈ నాలిగిట్లో ఏ ఒక్క‌టీ జ‌ర‌గ‌లేద‌ని అన్నారు.

పైగా అవినీతి ఇప్పుడు క‌నీసం రూ.2000 నోటు! అన్న రేంజ్‌ లో సాగుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. కార్పొరేట్‌ శక్తులకు మోదీ త‌న మూడేళ్ల పాల‌న‌లో 2లక్షల కోట్లు రుణమాఫీ చేసి, రైతుల రుణమాఫీని గాలికి వదిలేశార‌ని విరుచుకుప‌డ్డారు. దేశ ఆర్థిక వృద్ధి రేటు దారుణంగా పడిపోయిందని, నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందని విమర్శించారు. మోదీ ప్రధానిగా కంటే మంచి ఈవెంట్‌ మ్యానేజర్‌గా బాగా పనికి వస్తారని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఆర్‌ ఎస్‌ ఎస్‌ ద్వారా బీజేపీ మత కలహాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. దేశంలో రోజు రోజుకూ బీజేపీ పతనం అవుతోందని చెప్పారు. మొత్తంగా నిన్న యశ్వంత్ ఉతికి ఆరేస్తే.. నేడు ఏచూరి ఏకంగా పిండేశారు!! మ‌రి మోదీ ఏమంటారో చూడాలి.