Begin typing your search above and press return to search.

సీత ఓ టెస్ట్ ట్యూబ్ బేటీ..డిప్యూటీ సీఎం క్లారిటీ

By:  Tupaki Desk   |   1 Jun 2018 1:11 PM GMT
సీత ఓ టెస్ట్ ట్యూబ్ బేటీ..డిప్యూటీ సీఎం క్లారిటీ
X
బీజేపీ నేత‌ల కొత్త సూత్రీక‌ర‌ణ‌ల‌కు తెర‌ప‌డ‌టం లేదు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్లుగా వివాదాస్ప‌ద కామెంట్ల స‌ర‌ళి కొన‌సాగుతూనే మ‌రోవైపు ఒకే నాయ‌కుడు అందులో కీల‌క స్థాయిలో ఉన్న వ్య‌క్తులు వివాదాస్ప‌ద విశ్లేష‌ణ‌లు చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దినేష్ శర్మ మరోసారి నోరు జారారు. మహాభారత కాలంలోనే జర్నలిజం ఉందన్న మరుసటి రోజే అలాంటిదే మరో షాకింగ్ కామెంట్ చేశారు. రామాయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ కాన్సెప్ట్ ఉందని - సీతనే దీనికి నిదర్శనమని ఆయన ఆశ్చ‌ర్య‌పోయే విశ్లేష‌ణ చేశారు.

హిందీ జర్నలిజం డే సందర్భంగా మధురలో జరిగిన కార్యక్రమంలో దినేష్ శర్మ మాట్లాడుతూ జర్నలిజం ఎక్కడ మొదలైంది అన్నదానిపై ఇప్పుడున్న వాదనలన్నింటినీ ఆయన కొట్టి పారేశారు. అసలు జర్నలిజం మహాభారత కాలంలోనే ఉందంటూ.. ఓ ఉదాహరణ కూడా చెప్పారు. మహా భారతంలో సంజయ అనే పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన హస్తినాపురంలో కూర్చునే కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం గురించి దృతరాష్ర్టునికి వివరించాడని - ఇది లైవ్ టెలికాస్ట్ కాకపోతే మరేంటి అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి గూగుల్‌ కు పురాణాల్లో నారద మునికి లింకు పెట్టారు. మీ గూగుల్ ఇప్పుడే మొదలైంది. కానీ మా గూగుల్ ఎప్పుడో ఉంది. నారద ముని సమాచారాన్ని చేరవేయడంలో ఆరితేరిన వారు. ఆయన ఎక్కడికైనా వెళ్లి సమాచారాన్ని పాస్ చేసేవాళ్లు అంటూ దినేష్ శర్మ చెప్పుకొచ్చారు. ``సీత ఓ మట్టికుండలో పుట్టిందని చెబుతారు. దీనిని బట్టి రామాయణం సమయంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ కాన్సెప్ట్ ఉన్నట్లు స్పష్టమవుతోంది`` అని దినేష్ శర్మ చెప్పారు.