Begin typing your search above and press return to search.

చర్లపల్లికి నో.. సిట్‌ కార్యాలయంలో ఉండాలి

By:  Tupaki Desk   |   8 Jun 2015 9:40 PM IST
చర్లపల్లికి నో.. సిట్‌ కార్యాలయంలో ఉండాలి
X
రేవంత్‌రెడ్డి కష్టాలు తీరేటట్లు లేవు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా బుక్‌ అయిన ఆయన.. రిమాండ్‌కు వెళ్లటం తెలిసిందే. విచారణ కోసం ఏసీబీ కస్టడీలో ఉన్న ఆయన.. తనకు ఏసీబీ ఎలాంటి వసతులు కల్పించటం లేదని.. తనను వెంటనే చర్లపల్లి జైలుకు తరలించాలంటూ పెట్టుకున్న అభ్యర్థన విషయంలో ఎదురుదెబ్బ తగిలింది.

తనకు వసతులు కల్పించలేదన్న అంశంపై రేవంత్‌ చేసిన అభ్యర్థన పట్ల కోర్టు సానుకూలంగా స్పందించలేదు. రేవంత్‌ను సిట్‌ కార్యాలయంలోనే ఉంచాలని ఆదేశించింది. ఇక.. రేవంత్‌ ఆరోపణలపై స్పందించిన పోలీసు అధికారులు.. ఆయనకు మినరల్‌ వాటర్‌.. కొత్త దుప్పట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. మొత్తానికి.. రేవంత్‌కు కస్టడీ కష్టాలు తప్పటం లేదనే భావన వ్యక్తమవుతోంది.