Begin typing your search above and press return to search.

పాల కారణంగా అక్కడ రోడ్ యాక్సిడెంట్స్?

By:  Tupaki Desk   |   25 Aug 2019 8:13 AM GMT
పాల కారణంగా అక్కడ రోడ్ యాక్సిడెంట్స్?
X
యాక్సిడెంట్లకు చాలానే కారణాలు ఉంటాయి. కానీ.. పాల కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న వైనం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. పాలు రోడ్ల మీదకు కాలువలు కట్టినట్లుగా పోవటంతో ఆ రోడ్డు మీద ప్రయాణించే ద్విచక్రవాహనదారులంతా రోడ్డు ప్రమాదాలకు గురైన వైనం రాజస్థాన్ లో చోటు చేసుకుంది.

రాజస్థాన్ లోని బ్యావర్-పిండ్వాడా ఫోర్ లైన్ వద్ద బాహరీఘాటా హనుమాన్ మంది ఉంది. అక్కడికి సమీపంలో ఒక భారీ పాల ట్యాంకర్ పల్టీ కొట్టింది. దీంతో ట్యాంకర్ లోని 30వేల లీటర్ల పాలు రోడ్ల మీద పోసాయి. ట్యాంకర్ బోల్తా పడినంతనే.. ట్యాంకర్ మూత తెరుచుకుంది. దీంతో.. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ట్యాంకర్ చుట్టూ చేశారు.

రోడ్డు మీదకు ఒలికిపోతున్న పాలను తమ దగ్గరి బక్కెట్లు.. డ్రమ్ముల్లో నింపుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు తమ దగ్గరి బాటిల్స్ తో నింపుకుంటే.. మరికొందరు మంచినీళ్లు తాగినట్లుగా తాగేశారు. ట్యాంకర్ నుంచి పాలు పోతున్న విషయాన్ని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. రోడ్ల మీదకు పెద్ద ఎత్తున పాలు పారటంతో.. అటువైపు ప్రయాణించిన టూవీలర్లు స్కిడ్ అయి.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. మొత్తంగా పాల ట్యాంకర్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదని చెప్పక తప్పదు.