Begin typing your search above and press return to search.
ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
By: Tupaki Desk | 29 March 2023 4:03 PM GMTసాధారణంగా ఒక కాన్పులో ఇద్దరు పిల్లలకు జన్మనిస్తేనే చాలా అరుదైన విషయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ముగ్గురు పిల్లలకు జన్మనిస్తే చాలా పెద్ద విషయం.. అదే నలుగురు పిల్లలకు జన్మనిస్తే వండర్ అనుకోవాల్సిందే.
కోటిలో ఒకరు ఇలా ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చే మహిళలు ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ అరుదైన ప్రసవం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కేంద్రంలో లావణ్య ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన లావణ్య కాన్పుకోసం ముస్తాబాద్ ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆమెకు 9 ఏళ్ల క్రితం మొదటి కాన్పులో బాబు జన్మించాడు. ఇది రెండవ కాన్పు ఆమెకు.
రెండవ కాన్పులో ఏకంగా నలుగురు పిల్లలు జన్మించారు. నలుగురు పిల్లలో ముగ్గురు బాబులు మరియు ఒక పాప జన్మించింది. మొత్తంగా లావణ్య దంపతులకు అయిదుగురు పిల్లలు అయారు. నలుగురు కొడుకులు ఒక కూతురు. పుట్టిన పిల్లలు అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారట.
నలుగురు కూడా కేజీ కి కాస్త అటు ఇటుగా పుట్టినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం నలుగురు పిల్లలను కూడా స్థానిక పిల్లల ఆసుపత్రి లో ఉంచినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. ఒకే కాన్పులో లావణ్య నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.