Begin typing your search above and press return to search.
మూడు జిల్లాలకు ఒకే జెడ్పీ ఆఫీస్
By: Tupaki Desk | 4 April 2022 1:30 AM GMTజిల్లాలు అయితే ఒకే ఒక ఉత్తర్వులో మూడు అయ్యాయి. కానీ ఇప్పటిదాకా ఒక్కటిగా ఉంటున్న జిల్లా పరిషత్ మూడు ముక్కలు అయ్యే పని కాదు కదా. అది రాత్రికి రాత్రి చేసేయలేరు. అందుకే ప్రస్తుతానికి మూడింటికీ ఒకే జెడ్పీ ఆఫీస్ అని అధికారులు డిసైడ్ అయ్యారు.
అలా విశాఖ జిల్లా పరిషత్ మూడు జిల్లాలకూ కేంద్రంగా ఉంటుందన్న మాట. విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుభద్ర మూడు జిల్లాలకూ బాధ్యులుగా ఉంటారన్న మాట. నిజానికి జిల్లాల విభజన అంటేనే రాజకీయాల కోసం. పదవుల కోసం, ఇపుడు మూడు జిల్లాలు అయ్యాయి అంటే ముగ్గురుకు పదవులు వస్తాయని సహజంగా భావిస్తారు.
కానీ ఎన్నికలు చూస్తే గత ఏడాది అయిపోయాయి. విశాఖను ఎస్టీగా రిజర్వ్ చేసి జెడ్పీ చైర్ పర్సన్ ని ఎన్నుకున్నారు. ఇపుడు విశాఖ నుంచి ఏజెన్సీయే కొత్త జిల్లాగా విడిపోతోంది. అక్కడ నుంచి వచ్చిన జెడ్పీ చైర్మన్ అల్లూరి జిల్లాకు చైర్మన్ గా మాత్రమే ఇకపైన ఉండాలి.
కానీ జిల్లాలు విడగొట్టినంత సులువు కాదు జెడ్పీని విభజించడం. అదే టైమ్ లో దానికి చాలా తతంగం ఉంది. అందుకే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ దీని మీద వివరణ ఇచ్చేశారు. ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్తుల నుంచే పాలన సాగుతుందని పేర్కొన్నారు.
దీని మీద తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని తెలిపారు. అది పూర్తి అయిన తరువాతనే జిల్లా పరిషత్తుల విషయంలో విధి విధానాలు ప్రకటిస్తామని వెల్లడించారు. అంటే జిల్లాలు ఇరవై ఆరు అయ్యాయి కానీ జిల్లా పరిషత్తు చైర్మన్లు మాత్రం పదమూడు మందే ఉంటారన్న మాట. ఇప్పట్లో కొత్త వారు కానీ ఆశావహులు కానీ జెడ్పీ చైర్మన్ కుర్చీ ఎక్కాలన్ని ఆశపడితే మాత్రం అది తొందరపాటే అవుతుంది. మొత్తానికి జిల్లాలుగా విడిపోయినా ఇతర బంధాలు మాత్రం కొంతకాలం అలాగే కొనసాగుతాయని చెప్పాలి.