Begin typing your search above and press return to search.
పెను సంచలనానికి తెర తీసిన సుప్రీం జడ్జి
By: Tupaki Desk | 6 Jun 2017 7:44 AM GMTదేశ వ్యాప్తంగా ఉన్న కేసుల్ని పరిష్కరించాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుందన్న మాటను పలుమార్లు విన్నప్పటికీ.. అలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇప్పటివరకూ ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్న విషయం తెలిసిందే. దీంతో.. ఇలా చెప్పుకోవటమే కాదు.. అందుకు తగిన పరిష్కారం దొరకని నేపథ్యంలో.. అంతకంతకూ కేసుల పెరిగిపోవటమే తప్పించి తగ్గిపోవటం అన్నది కనిపించని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక సుప్రీంకోర్టు జడ్జి అరుదైన రికార్డును సృష్టించారని చెబుతున్నారు. సుప్రీంకోర్టులో అరుదైన సన్నివేశం సోమవారం చోటు చేసుకుందన్న మాట వినిపిస్తోంది.
ఎందుకంటే.. ఒక జడ్జి ఒకే రోజు వ్యవధిలో 33 కేసుల్ని పరిష్కరించటమే దీనికి నిదర్శనం. ఇద్దరు జడ్జిలున్న ధర్మాసనంలో సీనియర్ న్యాయమూర్తి ఎం శాంతనగౌడర్ అనారోగ్యంతో సెలవులో ఉన్నారు. దీంతో.. జస్టిస్ దీపక్ గుప్తా ఒక్కరే ధర్మాసనానికి నేతృత్వం వహించారు.
ఆయన ఒక్కరే కేసుల్ని పరిష్కరించటం న్యాయవాదులతో పాటు.. ఫిర్యాదుదారులు కూడా ఆశ్చర్యపోయారు. సుప్రీంకోర్టులో ఒక సింగిల్ జడ్జి కేసుల్ని పరిష్కరించటం తాను 25 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదంటూ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెబుతున్నా.. సుప్రీం జడ్జి ఆ మాటల్ని పట్టించుకోకుండా కేసుల పరిష్కారం దిశగా అడుగులు వేశారు. సీనియర్ న్యాయమూర్తి అనారోగ్యంతో ఉండటంతో 33 కేసుల్ని వినాలని జస్టిస్ గుప్తాను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ ఒప్పించినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆయన ఓకే అని చెప్పటమే కాదు.. కేసుల పరిష్కార దిశగా చకచకా అడుగులు వేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకే రోజు వ్యవధిలో సింగిల్ జడ్జి ఇన్ని కేసుల్ని పరిష్కరించటం చాలా అరుదైనదిగా పలువురు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/