Begin typing your search above and press return to search.
ఆ తొమ్మిది మంది ఆత్మహత్య కాదు.. హత్యే
By: Tupaki Desk | 28 Jun 2022 1:17 PM GMTఇటీవల మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని మైసాల్ లో ఒకే కుటుంబంలో తొమ్మిది మంది మరణించిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలను పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. వీరంతా ఆత్మహత్య చేసుకోలేదని స్పష్టం చేశారు. వీరిని కొందరు విషమిచ్చి చంపారని తెలిపారు.
మహారాష్ట్రలో ఒకే కుటుంబంలో తొమ్మిది మంది చనిపోయిన కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఎట్టకేలకు వీరి డెత్ మిస్టరీ ని ఛేదించారు. వీరంతా ఆత్మహత్య చేసుకోలేదని స్పష్టం చేశారు. ఈ కుటుంబాన్ని కొందరు పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు.
మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని మైసాల్ లో జూన్ 20న ఒకే ఇంట్లో 9 మంది విగత జీవులుగా పడి ఉండటం కలకలం రేపింది. పశు వైద్యుడు డా. మాణిక్ యల్లప్ప వాన్మోర్, పోపట్ యల్లప్ప వాన్మోర్, ఆయన తల్లి, భార్య, పిల్లలు సహా మొత్తం 9 మంది మృతదేహాలు ఒకే ఇంట్లో కనిపించాయి. అయితే.. మృతుడి జేబులో సూసైడ్ నోట్ చూసి ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకున్నారు పోలీసులు.
మొదట ఆత్మహత్యగా భావించిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేశారు. ఇంట్లో మృతదేహాలు పడి ఉన్న తీరు చూసి అనుమానంతో పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వాన్మోర్ కుటుంబానిది ఆత్మహత్య కాదు.. సామూహిక హత్యలు అని తేల్చారు.
ధీరజ్ చంద్రకాంత్ సురవశే, అబ్బాస్ మొహ్మద్ అలీ బాగ్వాన్ అనే ఇద్దరు మాంత్రికులు ఆ కుటుంబానికి విషమిచ్చి చంపినట్లు తేల్చారు. గుప్త నిధుల కోసమే వీరిపై విషప్రయోగం చేశారని ఎస్పీ దీక్షిత్ గేడామ్ వెల్లడించారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.